Education minister critisice politicalizing inter issue రాజకీయం చేస్తున్నారన్న మంత్రి.. సంబంధం లేదంటున్న గ్లోబరీనా

Education minister critisice politicalizing inter issue

Proffessor Nageshwar Rao, inter board, Minister jagadeeshwar reddy, Telangana Educational minister, politicalizising inter issue, intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

Telangana Education Minister Jagadeeshwar Reddy stated that there have been some errors in the intermediate results and the government is looking into it. The issue has not been resolved. He also stated that the issue is being politicalised by some parties.

రాజకీయం చేస్తున్నారన్న మంత్రి.. సంబంధం లేదంటున్న గ్లోబరీనా

Posted: 04/23/2019 04:36 PM IST
Education minister critisice politicalizing inter issue

తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో కొంత మంది రాజకీయ లబ్ధి కోసం సమస్యను వివాదాస్పదం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ వ్యవహారంపై తాము నియమించిన కమిటీ 3 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందనీ, అప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కొందరు చేస్తున్న రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత గ్లోబరీనీ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ మానవ తప్పిదమని తేలితే ఆయా వ్యక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తేల్చిచెప్పారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు మరోసారి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కాగా, ఇంటర్ మార్కుల వ్యవహారంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని గ్లోబరినా సంస్థ తనను తానుగా దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థే కారణమని కొందరు ఆరోపిణలు వినిస్తున్నా వేళ.. తమకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని సంస్థ వర్గాలు వాదిస్తున్నాయు. ఈ నేపథ్యంలో గ్లోబరీనా సంస్థ అధినేత, సీఈవో వీఎస్ఎన్ రాజు స్పందించారు. తెలంగాణ బోర్డు విడుదల చేసిన ఫలితాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము పారదర్శకంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకు ఆదేశించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. తాము టెండర్లు దక్కించుకోవడం వెనుక ఎలాంట రాజకీయ ఒత్తిళ్లు లేవని రాజు అన్నారు. మిగతా సంస్థల కంటే తక్కువ కోట్ చేశాం కాబట్టే టెండర్ తమకు దక్కిందని పేర్కొన్నారు. తమపై కాకినాడ జేఎన్ టీయూ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. జేఎన్ యూటీ సంస్థే తమకు ఇంకా కోట్లాది రూపాయలు చెల్లించాలన్నారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలని రాజు కోరారు. అయితే ఎలాంటి అనుభవం లేని ఈ సంస్థ ఇంటర్ బోర్డు నిబంధనలకు నీళ్లు వదిలి టెండర్ ను రాబట్టకుందన్న అరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

ఇదిలావుండగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ జవాబు పత్రాలను మరోమారు రీవాల్యూయేషన్ లేదా రీ కౌంటింగ్ చేయించుకునేందుకు ఇంటర్ బోర్డు రెండు రోజుల అదనపు సమాయాన్ని కూడా కేటాయించింది. ప్రసుత్తం ఈ నెల 25 వరకు మాత్రమే రీ కౌంటింగ్, రీ వాల్యూయేషన్ కు సమయాన్నిచ్చిన ఇంటర్ బోర్డు.. పెద్ద ఎత్తున్న విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం వస్తున్న క్రమంలో ఇంటర్ బోర్డు సైట్ కూడా పనిచేయడం లేదని విమర్శల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh