Chiranjeevi appreciates fireman kranti kumar క్రాంతికుమార్ కు మెగా అభినందనలు, బహుమతులు

Megastar chiranjeevi appreciates fireman kranti kumar

Megastar, Chiranjeevi, fireman, Kranti kumar, 4 years old girl child, saviour, Allu Aravind, Gouliguda, Chiranjeevi blood bank, Hyderabad, appreciation

Tollywood Megastar Chiranjeevi appreciates fireman kranti kumar, who turned a saviour of 4 years old girl child who accidentally drowned in nala at gouliguda.

క్రాంతికుమార్ కు మెగా అభినందనలు, బహుమతులు

Posted: 04/23/2019 05:18 PM IST
Megastar chiranjeevi appreciates fireman kranti kumar

అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్క రోజునే మూడు కాలాలను రాష్ట్రవాసులకు చూపిస్తూ.. అందోళన కలిగిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో హైదరాబాద్ నగరంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రంగం కూడా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రమాదంలో కూరుకుపోయిన వారిని పట్టించుకునే వారు ఉంటారా.? తమ ప్రాణాలనోడ్డి ఇతరుల ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేస్తారా.?. అంటే అలాంటి వారు ఉన్నారు.

హైదరాబాద్ కోఠి నుంచి అప్జల్ గంజ్ వెళ్లే మార్గంలో సరిగ్గా గౌలీగూడ వద్ద ఓ నాలుగేళ్ల చిన్నారి దివ్య నాలాలో పడిపోయింది. సమాచారం తెలిసిన ఫైర్ మెన్ క్రాంతి కుమార్ నాలాలోకి వెళ్లి ఆ చిన్నారి దివ్యను మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్‌మేన్‌ క్రాంతి కుమార్ ను అభినందించారు. అంతేకాదు క్రాంతి కుమార్‌కు కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్‌ అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు.

క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్‌ సేషన్‌ ఆఫీసర్‌ జయరాజ్ కుమార్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని అల్లు అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు. అంతేగా మరి మంచి చేసిన వారికి తగిన గుర్తింపును అందిస్తే.. వారు మరింత మంచి చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే భావన పెంపోందించడానికి మెగాస్టార్ చిరంజీవి చేసిన అభినందన కార్యక్రమంలో క్రాంతికుమార్ ను రియల్ హీరోగా నిలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles