YS Jagan welcomes Mohan babu into YCP party వైసీపీ పార్టీలో చేరిన మంచు మోహన్ బాబు..

Actor and former mp mohan babu joins ysrcp party

YSRCP president YS Jagan, YS Jagan Manchu MohanBabu, Manchu MohanBabu joins YCP, YS Jagan sensational comments, YS Jagan on forth comming government, YS Jagan people's government, YS Jagan, YSRCP, Mohan Babu, sensational decision, fees reimbursement, andhra pradesh, politics

Actor, producer, former rajya sabha MP, sri vidyaniketan educational society chairman Manchu Mohan Babu today joins YCP party in liwu of Elections. YSRCP president YS Jagan welcomes him in to the party at lotuspond.

ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ఇక వైసీపీ నేతే..

Posted: 03/26/2019 02:39 PM IST
Actor and former mp mohan babu joins ysrcp party

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలువురు తటస్థులు కూడా ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవడం, ఇక మరికోందరు సెలబ్రిటీలు ఏకంగా రాజకీయా పార్టీలకు మద్దతుగా చేరిపోవడం కూడా జరిగిపోతుంది. ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో అధికార టీడీపీ పార్టీపై నిరసనకు పిలుపునిచ్చి.. అనేక విమర్శలు ఎదుర్కోన్న నేపథ్యంలో ఎట్టకేలకు తనకు ఓ జెండా అవశ్యకత అవసరాన్ని గుర్తించిన ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్, మాజీ ఎంపీ, విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు.

లోటస్ పాండ్ లోని జగన్‌ నివాసానికి ఇవాళ ఉదయం వెళ్లిన మంచు మోహన్ బాబు.. వైసీపీ పార్టీలో చేరారు. దీంతో వైసీపీ పార్టీ అధినేత జగన్‌.. మోహన్ బాబుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్‌ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసిందంటూ ఇటీవల ఆందోళన చేసిన మోహన్ బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వైఎస్‌ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య.. వైఎస్‌ సోదరుడి కుమార్తె.

 ఈ కారణంగానే తరచూ జగన్‌ను మోహన్‌బాబు కలిసేవారు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మోహన్‌బాబు కలిశారు. రాజకీయం వేరు.. బంధుత్వం వేరు అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలవడంతో టీడీపీలోకి మోహన్‌బాబు రీఎంట్రీ ఖాయమని వార్తలొచ్చినా వాటిని ఆయన ఖండిస్తూనే వచ్చారు. 'నేను ఏ పార్టీకి చెందని వ్యక్తిని' అని తరచూ వ్యాఖ్యానించే మోహన్ బాబు ఇటీవల కాలంలో జగన్ తో పలుమార్లు భేటీ అయ్యారు. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన సందర్భంగా జగన్ ను స్వయంగా పరామర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  Mohan Babu  sensational decision  fees reimbursement  andhra pradesh  politics  

Other Articles