Mahbubnagar TRS MP in talks with BJP బీజేపిలోకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి..?

Shock to trs party former mp jitender reddy to join bjp

shock to ruling TRS party, Jitender reddy is to join BJP, shock to TRSKTR, loksabha elections, Jitender reddy, TRS, MahabubNagar, Telangana, DK Aruna, BJP, Telangana politics

In front of Indian General Elections its a shock to ruling TRS party as its former member of parliament Jitender reddy is to join BJP party.

టీఆర్ఎస్ కు షాక్.. బీజేపిలోకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి..?

Posted: 03/26/2019 03:24 PM IST
Shock to trs party former mp jitender reddy to join bjp

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ గత ఐదేళ్లుగా ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చిన షాక్ లకు ఇప్పుడు ఆ పార్టీకే తగులుతున్నాయి. ఆ పార్టీలో కీలక నేతలుగా ఎదిగిన వివేక్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడంతో షాక్ తిన్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మరో కీలక నేత కూడా షాకివ్వనున్నారు. మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి తమ మాతృపార్టీ బీజేపీలో మరోమారు చేరబోతున్నారని, అందుకు ముహూర్తం కూడా ఖారారు చేసుకున్నారని సమాచారం. ఈ నెల 29న జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభలో ఆయన చేరబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆయనను తమ పార్టీలో చేరేందకు బీజేపీ అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. ఈక్రమంలోనే హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తో జితేందర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మూడు ప్రధాన డిమాండ్లను రాంమాధవ్‌ ముందు పెట్టారని సమాచారం. అయితే వాటిలో రెండింటికి రాంమాదవ్ నుంచి కూడా సుత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇంతకీ బీజేపీ ఎదుట జితేందర్ రెడ్డి పెట్టిన షరతులు ఏంటంటే..

మొదటి షరతు… మార్చి 29న మహబూబ్ నగర్ సభకు రానున్న మోదీతో కలిసి తనకు కూడా హెలికాఫ్టర్ లో చోటు కల్పించాలని, రెండవ షరతుగా.. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలను ఇవ్వాలని, ఇక మూడవ  షరతుగా.. ఏదో ఒక రాష్ట్రం నుంచి తనను రాజ్యసభకు పంపాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటు విషయంలో మాత్రం రాంమాధవ్ నుంచి జితేందర్ రెడ్డికి స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తోంది. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు అవకాశం ఉంటే రాజ్యసభకు కూడా పంపిస్తామని రాంమాధవ్ చెప్పడంతో… జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడానికి సుముఖత తెలిపినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jitender reddy  TRS  MahabubNagar  DK Aruna  BJP  Telangana  Telangana politics  

Other Articles