prabha collapsed at kotappakonda, devotees injured కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి.. కూలిన భారీ ప్రభ

Prabha collapsed at kotappakonda devotees injured

minor disturbance at kotappakonda tirunallu, minor distubance at kotappakonda feast, minor distubance at trikuteshwar swamy temple, minor distubance as a gaint prabha collapse, devotees injured as a gaint prabha collapse, minor disturbance, Gaint prabha, Collapse, kotappakonda Temple, trikuteshwar swamy temple, Guntur

minor disturbance in Guntur district kotappakonda trikuteshwar swamy temple as a gaint prabha which is being bought from nearby village to temple had been collapsed, few devotees got injured and were rushed to hospital for treatment.

ITEMVIDEOS: కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి.. కూలిన భారీ ప్రభ

Posted: 03/04/2019 05:16 PM IST
Prabha collapsed at kotappakonda devotees injured

శివరాత్రి పర్వదినం అనగానే ముందుగా గుర్తుకువచ్చే పంచారామక్షేత్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవాలయం. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే తిరునాళ్లలో ప్రభలకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. కోట్ల రూపాయాల వ్యయంతో నిర్మించిన ప్రభలు శివరాత్రి రోజు కొండ వద్ద వరుసగా ఏర్పాటు చేసే ప్రభల వెలుగులతో కొండ దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

ఒకటి కాదు.. రెండు కాదు.. దశాబ్దాలుగా పల్నాడు ప్రాంత వాసులు ప్రభలని ఏర్పాటుచేస్తూ సంప్రదాయ పరిరక్షణకు పాటుపడుతున్నారు. సంప్రదాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ నేటి తరం ఎంత ఖర్చయినా సరే ప్రభలు నిర్మించి తరలిస్తూనే ఉన్నారు. కాగా ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా చిన్నపాటి అపశ్రుతి చోటుచేసుకుంది. తిరునాళ్ల కోసం సిద్ధం చేసిన భారీ ప్రభను కొండపైకి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

మహా శివరాత్రిని పురస్కరించుకుని నేడు కోటప్పకొండ తిరునాళ్లు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కొండపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles