Sheriff: 23 confirmed dead in apparent tornado అమెరికా అలబామాపై టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

Tornadoes kill at least 23 injure dozens more in alabama

Tornadoes, Weather, Alabama, Georgia, Florida, Western Carolina, Fear, windstorms, Emergency Management, weather, Temperatures, National Weather Service

Several tornadoes hit the Southeast Sunday afternoon, killing at least 23 people in one Alabama county on the USA's deadliest day for tornadoes in almost 6 years.

ITEMVIDEOS: అమెరికా అలబామాపై టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

Posted: 03/04/2019 11:58 AM IST
Tornadoes kill at least 23 injure dozens more in alabama

అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీపై అదివారం నాడు రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో ఏకంగా 23 మంది  ప్రజలు చనిపోయారని సమాచారం. మృతిచెందినవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తుంది. టోర్నడోల ధాటికి అనేకమంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని లీ కౌంటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్  జే జోన్స్ తెలిపారు.

ఆకస్మికంగా టోర్నడోల విరుచుకుపడటంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. సెల్ ఫోన్ టవర్లు నేలకొరిగాయి. హోర్డింగులు కూడా రోడ్డపై కప్పకూలాయి. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఆదివారం మధ్యాన్నానికి 40మందికి పైగా గాయాలపాలైనవారు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తూర్పు అలబామా మెడికల్ సెంటర్ తెలిపింది. గాయాలపాలైన మరికొందరిని స్థానిక హాస్పిటల్స్ కు తరలించారు.

చెట్లు కూలి రోడ్లపై పడిపోవడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా హైవే-51,  లీ రోడ్ 38, దగ్గర టోర్నడో ప్రభావం అధికం ఉందని అధికారులు తెలిపారు. జార్జియా, ఫ్లోరిడా, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో కూడా టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. టోర్నడోల ప్రభావంతో మృతిచెందినవారి కుటుంబాలకు గవర్నర్ కే ఇవాయ్ సానుభూతి తెలిపారు. క్షత్రగాత్రులను అస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం పలు బృందాలు రంగంలోకి దిగాయాని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : usa  Toll rise  tornados  people Missing  alert  damage  dangerous  Alabama  Georgia  Florida  Western Carolina  

Other Articles