'What a shame' netizens slam Union Minister అమరవీరుడి ముందు సెల్పీ.. కేంద్రమంత్రిని ఏకిపారేసిన నెట్ జనులు

Union mos alphons lambasted for posting picture near martyr s coffin

Alphons Kannanthanam, Jawan, Vasantha Kumar, pulwama terror attack, killed, cremation, coffin, netizens, selfie in front of coffin, social media, facebook, twitter, flood, relief camp

Union Minister Alphons Kannanthanam has embroiled himself in controversy, for posting a picture of him in front of the coffin of Vasantha Kumar, the jawan who was killed in the terror attack in Pulwama. Alphons posted the picture on Twitter and Facebook, only to delete it later following social media ire.

అమరవీరుడి ముందు సెల్పీ.. కేంద్రమంత్రిని ఏకిపారేసిన నెట్ జనులు

Posted: 02/18/2019 12:02 PM IST
Union mos alphons lambasted for posting picture near martyr s coffin

దాయది దేశం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దొంగదెబ్బ తీసి మన దేశ సైనికులపై అత్మహుతి దాడికి పాల్పడి ఏకంగా 48 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన ఘటనను భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఇది పిరికి పంద చర్యని.. విదులకు హాజరయ్యేందుకు వాహనాల్లో వస్తున్న జవాన్లను టార్గెట్ గా చేసుకుని ఈ దారుణ ఉగ్రబీభత్సానికి ముష్కరులు పాల్పడటాన్ని దేశం మొత్తం తీవ్రంగా అక్షేపించింది.

అయితే అమరవీరులకు పట్ల తమ సానుభూతిని, సంతాపాన్ని చాటుకునే క్రమంలో భాగంగా దేశప్రజలు వారి కుటుంబాలకు అండగా వుంటామని ప్రతీణబూనుతూ.. వీరజవాన్ల అంతిమయాత్రలో పాల్గోంటున్నారు. అయితే ఆత్మాహుతి దాడిలో అమరుడైన ఓ సీఆర్పీఎఫ్ జవాను శవపేటిక ముందు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నన్ సెల్ఫీ దిగడం చర్చనీయాంశమైంది. దీనిని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అమరవీరుడు వసంతకుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సాగుతున్న వేళ, నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన, సెల్ఫీలు దిగడం ఏంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కనీస బాధ్యతను మరిచి ఇలా చేయడం తగదని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలపై అల్ఫోన్స్ స్పందిస్తూ, తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నానని, తన తండ్రి కూడా సైనికుడేనని అన్నారు. ఓ సైనికుడు అమరుడైతే ఎంత బాధ కలుగుతుందో తనకు తెలుసునని చెప్పారు. అయితే, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టి, విమర్శలకు గురికావడం అల్ఫోన్స్ కు ఇదే తొలిసారేమీ కాదు. గత సంవత్సరం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ఆశ్రయం పొందుతున్న బాధితులను కలిసిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగి పోస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధమైన విమర్శలు వెల్లువెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alphons Kannanthanam  Alphons selfir  Jawan  Vasantha Kumar  pulwama terror attack  coffin  netizens  

Other Articles