Pulwama mastermind Abdul Rasheed Ghazi killed పుల్వామా మాస్టర్ మైండ్ ఘాజీని మట్టుబెట్టిన ఆర్మీ

Pulwama terror attack mastermind abdul rasheed ghazi killed by army

Jaish-e-Mohammed, Pulwama mastermind Abdul Rasheed Ghazi, Encounter, Pulwama, attack, militants, Pulwama Terror attack, Suicide Attack in Kashmir, Pulwama Attack, CRPF, Pulwama encounter, encounter in J&K, pulwama encounter today, greater kashmir, Pulwama encounter, Jammu and Kashmir, Pulwama encounter, JK terrorists, Abdul Rasheed Ghazi, Abdul Rasheed Ghazi killed, pulwama terrorist attack,Pulwama encounter,Jammu and Kashmir terrorist attack,Jammu and Kashmir encounter,CRPF terror attack, Pulwama encounter

A top Jaish-e-Mohammed commander Abdul Rasheed Ghazi believed to be the mastermind beyond the suicide attack in Pulwama, was reportedly killed by Indian Army in an encounter in Pulwama Monday morning.

పుల్వామా ఘటన మాస్టర్ మైండ్ ఘాజీని మట్టుబెట్టిన ఆర్మీ

Posted: 02/18/2019 12:55 PM IST
Pulwama terror attack mastermind abdul rasheed ghazi killed by army

పుల్వామా సమీపంలోని అవంతిపురాలో జాతీయ రహదారిపై విధులకు హాజరవుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి వెనుకనున్న మాస్టర్ మైండ్, ఐఈడీ నిపుణుడు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషై మహమ్మద్ టాప్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీని భారత అర్మీ మట్టుబెట్టింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దొంగచాటుగా ఆత్మహుతికి దాడికి పాల్పడిన ఘటనలో పాల్గోన్న మరో ఉగ్రవాదిని భారత సైన్యం ప్రాణాలతో పట్టుకుందని సమాచారం.

అర్మీ వాహనాలను టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడిన ఆత్మహుతికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ కు శిక్షణ ఇచ్చిన జైషే మహమ్మద్ టాప్ కమాండర్ కూడా అబ్దుల్ రషీద్ ఘాజీనేనని భారత భద్రతాదళాలు నిర్థారించాయి. కాగా ఉగ్రవాది ఘాజీ రషీద్ ఈ ఘటన తరువాత ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదలు అటుగా వచ్చిన ఇండియన్ ఆర్మీపై ఇవాళ ఉదయం కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఒక మేజర్ తో పాటుగా ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలను కొల్పోయారు.

ఈ ఘటనతో మరోమారు పుల్వామా ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వెంటనే రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టి.. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్ సహా మరో ఉగ్రవాదిని భారత సైన్యం కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టింది. ఆత్మాహుతి దాడి జరిగిన అవంతిపోరా ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో గత రాత్రి నుంచి ఎన్ కౌంటర్ జరుగుతూ ఉంది.

కాగా ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించి, ఓ మేజర్, ముగ్గురు జవాన్లను, ఓ పౌరుడిని కాల్చిచంపారు.  ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఎన్ కౌంటర్ ప్రారంభించిన సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు, ఘాజీ రషీద్ ను హతమార్చాయి. మరణించింది రషీదేనని ఓ సైనికాధికారి స్పష్టం చేశారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles