Modi trying to destabilize karnataka govt: Siddaramaiah ఒక్క ఎమ్మెల్యేకు 70 కోట్లా.? ఎక్కడింత డబ్బు: మాజీ సీఎం

Modi seeking help from crony friends to fund operation kamala claims siddaramaiah

Siddaramaiah, Karnataka, HD Kumaraswamy, Operation Kamal, Janata Dal (Secular), Narendra Modi, Bharatiya Janata Party, Amit Shah, Congress, chowkidar, constitution, Politics

Taking a jibe at PM Narendra Modi for Operation Kamal, former Karnataka CM Siddaramaiah said the PM seems to be protecting his crony friends to secure funds for “unconstitutional and undemocratic act” of poaching Congress-JD(S) MLAs.

ఒక్క ఎమ్మెల్యేకు 70 కోట్లా.? ఎక్కడింత డబ్బు: మాజీ సీఎం

Posted: 01/19/2019 11:48 AM IST
Modi seeking help from crony friends to fund operation kamala claims siddaramaiah

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమని.. ఇటీవల బీజేపీ నేత ఈశ్వరప్ప ఢిల్లీలో ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అప్పటివరకు ధీమాగా వున్న కాంగ్రెస్ నేతలు హుటుహుటిన బెంగుళూరులో కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హజారు కావడం కాంగ్రెస్ పార్టీతో పాటు కుమారస్వామి ప్రభుత్వంలో కలకలం రేపింది.

అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 76 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపి పార్టీ అపరేషన్ కమలం సాగిస్తున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అవకాశం ఇవ్వకూడదని భావించిన కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా.. బీజేపి ప్రలోభాలకు లోంగకుండా.. మరోమారు రిసార్టు రాజకీయాలకు తెరలేపింది. తమ ఎమ్మెల్యేలందరినీ ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.70-75 కోట్లు ఇవ్వజూపిందని.. మోదీకి అంతపెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. దేశంలోని కుభేరులైన వారికి సంక్షేమాన్ని కాంక్షించే ప్రధాని వారి సహకారంతోనే తమ ఎమ్మల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయాలని చూస్తున్నారని.. వారికి కోట్ల రూపాయల ఆశజూపి ప్రలోబాలకు గురిచేస్తున్నారని అరోపించారు.

కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నిస్తోందని... ఈ కుట్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భాగస్వాములేనని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్న డబ్బు నోట్ల రద్దు ద్వారా సంపాదించినవా.? లేక రాపెల్ డీల్ వ్యవహారంలో సంపాదించినవా.? అంటూ ఆయన ప్రధాని మోదీ టార్గెట్ గా ప్రశ్నలు సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  Karnataka  Operation Kamal  Narendra Modi  Amit Shah  Congress  Politics  

Other Articles