Infant among 8 killed in fire at Mumbai's ESIC hospital ముంబై అసుపత్రి అగ్నిప్రమాదం: 8కి చేరిన మృతుల సంఖ్య

Mumbai fire six month old among 8 deceased at esic kamgar hospital in andheri

Andheri esi hospital fire, esic hospital andheri fire, mumbai fire, fire in andheri hospital, kamgar hospital andheri, fire in andheri, fire in mumbai, esic hospital, esic hospital andheri, esic hospital in mumbai, ESIC Kamgar Hospital, andheri, marol fire tragedy, mumbai, crime

A fire that broke out at the ESIC Kamgar Hospital at Marol in suburban Andheri in Mumbai claimed 8 lives, injuring 145 patients and visitors. The deceased also includes a six-month old girl.

ముంబై ఈఎస్ఐ అసుపత్రి అగ్నిప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య

Posted: 12/18/2018 01:35 PM IST
Mumbai fire six month old among 8 deceased at esic kamgar hospital in andheri

ముంబైలోని ఈఎస్ఐ హాస్పిటల్ లో క్రితం రోజు జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ ప్రమాదంలో నిన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఇవాళ మృతి చెందారు. మృతుల్లో ఆరు నెలల పసికందు కూడా ఉంది. ఈ ఘటనలో మరో 145 మంది రోగులు, వారి బంధువులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు వివిధ అస్పత్రులకు తరలిచిన రెస్క్యూ అధికారులు వారికి చికిత్సనందిస్తున్నారు.

కాగా తీవ్రగాయాలతో విషమంగా వున్నవారిని మెరుగైన వైద్యం కోసం పలు మల్టీ స్పెషాలిటీ అసుపత్రులకు తరలించారు. అంధేరిలోని కామ్ ఘర్ లో ఉన్న ఈ హాస్పిటల్ నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు ఇతర అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో హాస్పిటల్ సిబ్బంది,రోగులు అధిక సంఖ్యలో మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని 10 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు.

ఈ ప్రమాదంలో సుమారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష నష్ట పరిహారాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ESIC Kamgar Hospital  andheri  marol fire tragedy  mumbai  crime  

Other Articles