life sentence for bhanukiran in maddalacheruvu suri murder case మద్దెలచెరువు సూరి హత్యకేసు: భానుకిరణ్ దోషే.. యావజ్జీవ శిక్ష..

Nampally court life sentence for bhanukiran in maddalacheruvu suri murder case

nampally court convicts bhanu kiran, life sentence for bhanu kiran, 5 years sentence for manmohan, bhanu kiran, manmohan singh, maddalacheruvu suri, suri murder case, Crime

Nampally court convicts bhanukiran and his aid manmohan singh in maddalacheruvu suri murder case, sentences life for bhanukiran and 5 years for manmohan. The four others in the case held are avicted.

మద్దెలచెరువు సూరి హత్యకేసు: భానుకిరణ్ దోషే.. యావజ్జీవ శిక్ష..

Posted: 12/18/2018 01:28 PM IST
Nampally court life sentence for bhanukiran in maddalacheruvu suri murder case

ఫ్యాక్షనిస్టు నేతగా, కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా చెలామణి అయిన గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్యకేసులో అతని ప్రధాన అనుచరుడు భానుకిరణ్ ను నాంపల్లి కోర్టు తేల్చింది. నమ్మకంగా మెలుగుతూనే పథకం ప్రకారం భానుకిరణ్, మద్దెలచెరువు సూరిని హత్యమార్చినట్టు నమ్మిన న్యాయస్థానం అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తు తీర్పును వెలువరించింది. దీంతో పాటు 20 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ కు సహకరించిన భాను అనుచరుడు మన్మోహన్ సింగ్ ను కూడా దోషిగా పరిగణించిన న్యాయస్థానం అతనికి ఐదేళ్ల కారాగారవాసంతో పాటు ఐదు వేల జరిమానా విధించింది. అయితే ఈ కేసులో ప్రమేయముందని అరెస్టైన ఆరుగురిలో కేవలం ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. మిగతా నలుగురు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులగా విడుదల చేసింది.

హైదరాబాద్ లోని యూసప్ గూడ ప్రాంతంలో 2011, జనవరి 4న సూరి కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అనంతరం భానుకిరణ్ పారిపోవడంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత పోలీసులు భానుకిరణ్ పై మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు దర్యాప్తు అధికారులు. ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఇవాళ న్యాయస్థానం వెలువరించింది.

హత్య జరిగిన వెంటనే సూరి డ్రైవర్ మధుమోహన్ పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసును సవాల్ గా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఇవాళ భానుకిరణ్; మన్మోహన్ సింగ్ లను దోషులుగా తేల్చింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ వాడిన తుపాకీ, కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nampally court  bhanu kiran  manmohan singh  maddalacheruvu suri  suri murder case  Crime  

Other Articles