Sajjan Kumar convicted in 1984 anti-Sikh riots సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ కుమార్ కు జీవితఖైదు

Sajjan kumar gets life imprisonment in 1984 anti sikh riots case

1984 Anti-Sikh Riots verdict, Anti Sikh Riots, Anti Sikh Riots 1984, Anti Sikh Riots 1984 verdict, sajjan kumar, Delhi High Court, anti sikh riots verdict, sajjan kumar, Captain Bhagmal, Girdhari Lal, Balwan Khokhar, Mahender Yadav, Justice S Muralidhar, Justice Vinod Goel, Delhi Cantonment area, Crime, national politics

The Delhi High Court today convicted Congress leader Sajjan Kumar in the 1984 anti-Sikh riot case, overturning a lower court order that had acquitted the Congress leader in the case.

సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ కుమార్ కు జీవితఖైదు

Posted: 12/17/2018 12:43 PM IST
Sajjan kumar gets life imprisonment in 1984 anti sikh riots case

దేశరాజధాని ఢిల్లీలో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో దోషిగా నిర్థారణ అయిన ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. సజ్జన్ కుమార్ ను నిర్ధేషిగా తేల్చిన కిందికోర్టు తీర్పును కూడా ఢిల్లీ హైకోర్టు తప్పబట్టింది. ఈ కేసు విషయంలో ట్రయల్ కోర్టు సాక్ష్యాలను సరిగా పరిశీలించలేదని, సాక్ష్యాలను తారుమారు చేయడంలో కుట్రకోణాన్ని కూడా పసిగట్టలేదని ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సజ్జన్ కుమార్ ను ఈ నెల 31లోగా పోలీసులకు లొంగిపోవాలని హైకోర్టు అదేశించింది.

దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై 1984 అక్టోబరు 31న అమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది తుపాకుల తూటాలతో కాల్చి చంపారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీవ్ర అగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు జరిగాయి. కాగా, ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో సజ్జన్ తో పాటు బల్వన్ ఖోఖార్, రిటైర్డు నేవి అధికారి కెప్టెన్ భగ్మల్, గిరిధారి లాల్ పై కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ కేసులో విచారణ చేసిన ట్రయల్ కోర్టు సజ్జనర్ పై తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఆయనను నిర్దోషిగా తేల్చింది. మిగిలిన నిందితులను దోషులుగా తేల్చి వారికి యావజ్జీవ శిక్షను విధించింది. దీనిపై సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కూడా ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసింది. దీంతో సజ్జనార్ ను దోషిగా పరిగణించిన న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ కారాగారాశిక్షను విధించడంతో పాటు ఈ కేసులోని మిగతా దోషులకు పదేళ్ల పాటు జైలు శిక్షను విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles