KTR took charge as TRS working President టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్

Ktr took charge as trs working president today at telangana bhavan

KTR took charge as TRS working President, KCR, KTR, kalvakuntla Taraka RamaRao, TRS Working President, Telangana politics

TRS leader K.T. Rama Rao took charge as the TRS working president at 11.55 am at Telangana Bhavan. Before he recieved a grand welcome from TRS activists, who took rally from cancer hospital to TRS bhavan.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్

Posted: 12/17/2018 12:33 PM IST
Ktr took charge as trs working president today at telangana bhavan

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇవాళ కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. పనిభారంతో తన కొడుకు కేటీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇవాళ కేటీఆర్ పదవీబాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించాయి. తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కేటీఆర్ నమస్కరించారు.

అనంతరం కార్యాలయంలో తన కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్ లోకి ప్రవేశించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహముద్ అలీ, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు హాజరవడంతో... తెలంగాణ భవన్ వద్ద కోలాహలం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  KTR  kalvakuntla Taraka RamaRao  TRS Working President  Telangana politics  

Other Articles