Pawan Kalyan interesting comments on telangana election తెలంగాణ ఎన్నికలలో పోటీపై పవన్ అసక్తికర కామెంట్స్

Pawan kalyan interesting comments on telangana election

pawan kalyan, janasena, Telangana Elections, CPI(M), Vijayawada, Telangana, Politics

Actor turned politician Jana Sena chief pawan kalyan interesting comments on contesting in Telangana Elections.

తెలంగాణ ఎన్నికలలో పోటీపై పవన్ అసక్తికర కామెంట్స్

Posted: 11/10/2018 06:45 PM IST
Pawan kalyan interesting comments on telangana election

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. ఇటు తెలంగాణలో సీపీఎం పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి వెళ్లాలని బావిస్తున్న క్రమంలో జనసేన అధినేత సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జనసేన పోటీపై రెండు, మూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనూహ్యంగా ముందస్తు ఎన్నికలు రావడం, క్షేత్రస్థాయిలో పార్టీ సన్నద్దం కాకపోవడంతో పోటీపై ఆలోచిస్తున్నామని చెప్పారు.

ముందస్తు ఎన్నికలు రాకుండా.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాదే ఎన్నికలు జరిగి ఉంటే 23 అసెంబ్లీ స్థానాల్లో, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావించామని తెలిపారు. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో.. పోటీపై సందిగ్ధంలో ఉన్నామని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగుతున్న కొంతమంది జనసేన మద్దతు కోరుతున్నారని, దానిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కాగా, ప్రస్తుతం ఏపీలో పార్టీ నిర్మాణంపై సీరియస్‌గా ఫోకస్ చేశారు పవన్ కల్యాణ్. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా పార్టీల్లోని అసంతృప్త నేతలను కూడా పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు లాంటి నేతలు పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరిచి టీడీపీ, వైసీపీలకు గట్టి పోటినివ్వాలని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Telangana Elections  CPI(M)  Vijayawada  Telangana  Politics  

Other Articles