Notification issued for Telangana election తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Ec issues notification for dec 7 election to telangana

telangana elections 2018, Telangana assembly notification, Telangana election officers, ts election notification, kcr, auspicious days, nominations, Telangana CEO, auspicious dads, candidates, nominations, sentiments

The Election Commission on Monday issued notification for the December 7 election to the Telangana Legislative Assembly.

తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రెండు రోజులే..

Posted: 11/12/2018 10:50 AM IST
Ec issues notification for dec 7 election to telangana

 తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు. షెడ్యూల్డు ప్రకారం మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ నిర్వహించనున్నారు. ముందుగా వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయి రోజు నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల స్వీకరణకు 19 వరకు గడువు ఉంది.

నవంబరు 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 7న పోలింగ్‌, 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అయితే, నామినేషన్ల దాఖలుకు మాత్రం అభ్యర్థులు తమ సెంటిమెంట్లకు పనిచెబుతున్నారు. మంచి రోజు, శుభముహూర్తం, శుభతిధులను ఎంచుకుని ఫాలో అవుతున్నారు. పలువురు అభ్యర్థులకు ఈ సెంటిమెంట్లు లేకపోయినా.. వారి ప్రధాన అనుచరులు సెంటిమెంట్లను ఫాలో కావాలని సూచించి మరీ ఫాలో అయ్యేలా చేస్తున్నారు.

ఈ క్రమంలో నామినేషన్ నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో ఈ ప్రక్రియ ఇవాళ ఉదయం 11 గంటలకే ఆరంభం అయ్యింది. అయితే ఈ రోజు అంత మంచిది కాదు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యే శుభ ఘడియలు ఉండటంతో అన్ని పార్టీల నేతలు ఈ రోజు నామినేషన్లను దాఖలు చేయలేని పరిస్థితి. అలాగే సోమవారం సాయంత్రం నుంచి మంగళవార వరకు కొనసాగుతున వర్జ్యం అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా చేస్తుంది. కాబట్టి రేపు కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు.

ఇక నవంబరు 15న అష్టమి కాబట్టి అంత మంచి తిథి కాదు. నవంబరు 16, 17 తేదిల్లో నవమి తిథి ఉన్నా సంఖ్యా పరంగా అంతగా కలిసిరాదని భావిస్తారు. అందుకే ఈ తేదీల్లోనూ నామినేషన్లు దాఖలు చేయడానికి నేతలు వెనుకంజవేస్తారు. నవంబరు 18 దశమి తిథి అయినా, ఆదివారం కావడం వల్ల నామినేషన్లు స్వీకరించరు. ఇక మిగిలింది కేవలం రెండు రోజులే.. అవి నవంబరు 14, 19 మాత్రమే. ఈ రెండు రోజుల్లో సప్తమి, ఏకాదశి తిథులు ఉండటమే కారణం.

కాబట్టి, నవంబరు 14,19 తేదీల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తే విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ముహూర్తాలు చూసుకుని ముందడుగు వేసే మన రాజకీయ నాయకులు, నామినేషన్ల సమయంలోనూ వాటిని పాటిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నామినేషన్‌ దాఖలకు ఏడు రోజులు గడువున్నా తిథి, శుభఘడియలు, వర్జ్యం, దుర్ముహూర్తంలు లాంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆ రెండు రోజులు మాత్రమే మంచివని జ్యోతిషులు వ్యాఖ్యానిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles