Demonetisation ghost continues to haunt నోట్ల రద్దు నిర్ణయాన్ని ఇప్పటికీ విమర్శిస్తున్న నెటిజనులు

Two years of demonetisation twitterities troll pm modi decision

satires on demonetisation, PM Modi, notes ban anniversary, Jokes on Note Ban, demonetisation, note ban, netizens, twitterities, creativity, troll PM decision, note ban troll, india news, bollywood memes, viral news

Netizens trolled PM Modi decision of demonitisation on the occassion of its completion of two years with memes and jokes online.

నోట్ల రద్దుకు రెండేళ్లు: సృజనాత్మకతతో విమర్శించిన నేటిజనులు

Posted: 11/09/2018 01:32 PM IST
Two years of demonetisation twitterities troll pm modi decision

పెద్ద నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా దేశవాసులు నాటి కష్టాలను మరోసారి తలచుకున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల దూరం వరకూ క్యూ లైన్లలో నిల్చుని పాత నోట్లను ఇస్తూ.. కొత్త నోట్లను తీసుకోవడానికి వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. తమ పిల్లల పెళ్లిళ్లు, చదువులు, అసుపత్రి బిల్లులు ఇలా అన్నింటికీ అనేక కష్టాలు పడిన ప్రజలు కేంద్రప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో తాము అనేక అవస్థలు పడ్డామని ఆనాటి వైనాన్ని గుర్తు తలచుకొని కళ్లు చెమర్చారు.

ఇప్పటికే నోట్ల రద్దు రేండేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నిన్ననే విమర్శలు గుప్పించారు. అయితే తామేం తక్కువ తిన్నామా.? అన్న నెటీజనులు కూడా మోడీ నిర్ణయాన్ని తమ సృజనాత్మకతను జోడించి మరీ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా నోట్ల రద్దుపై సెటైర్లు వేశారు.

2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దైన విషయం తెలిసిందే. ఈ సంచలనం జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లు. నల్లధాన్ని రూపుమాపడం, అవినీతిని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామంటూ ప్రధాని మోదీ నాడు ప్రకటించారు. వివిధ రంగాలపై దీని ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని, ఇప్పుడు ‘స్టాట్యూ ఆఫ్ ఫెయిల్యూర్’ పేరుతో మరో విగ్రహం నిర్మిస్తారా.. అంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. మోదీ భజనపరులకు నోట్ల రద్దు నచ్చిందని, ఈ ఒక్క కారణంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతుందని మండిపడ్డారు. ‘సిద్ధంగా ఉండండి.. మేరే ప్యారే దేశ్ వాసియోం.. అంటూ ఆయన మళ్లీ మొదలుపెట్టొచ్చు..’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. మోదీ ఫూల్ డే, బ్లాక్ డే.. అంటూ మరికొంత మంది విమర్శలు కురిపించారు.

 #Demonetisation is a @narendramodi made disaster who burned the farm to kill the mice...

What do you call when a person does this kind of an act??? #DestructionByDemonetisation pic.twitter.com/yMA67tgfb7

అదో పెద్ద స్కాం అంటూ మరికొంత మంది ఆరోపించారు. అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకున్న ప్రధాని మోదీ అన్నింటికంటే ముందుగా అదాయపన్ను శాఖను తమ అధీనంలోకి తీసుకున్నారని, దాని చలువతోనే భారీ కుంభకోణానికి తెరలేపారని నెటి జనులు విమర్శలు గుప్పించారు. ఎలుకల నిర్మూలన కోసం ఇళ్లు తగులబెట్టుకున్నట్లుగా నోట్ల రద్దు ఉందని మరో నెటిజన్ విమర్శించారు. ఇలాంటి పని చేసిన వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్యుల బాధలు, కన్నీటి వ్యథలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonitisation  note ban  netizens  twitterities  PM Modi  creativity  troll  viral news  

Other Articles

 • Will abide to fishermen development pawan kalyan

  మత్స్యకారుల సంక్షేమం పట్టని అధికార, విపక్షాలు

  Nov 13 | రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ఇది ఎన్నికలకు మందు అన్ని పార్టీలు కొస్త్రాంధ్ర ప్రాంతంలో పర్యాటించిన సందర్భంలో చెప్పే మాటే. ఎన్నికలు ముగియగానే.. వారి సంక్షేమాల కోసం చెప్పిన మాటలను గాలి... Read more

 • Bc sangh telangana bandh on 17th

  17న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల పిలుపు

  Nov 13 | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టిక్కెట్ల కేటాయించడంలో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపితో పాటుగా... Read more

 • High court issues notices to ap cm chandrababu in jagan attack case

  జగన్ పై దాడి కేసు: చంద్రబాబు సహా 8 మందికి హైకోర్టు నోటీసులు

  Nov 13 | ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసును.. ప్రభుత్వ కుట్రగా పేర్కోంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు... Read more

 • Hc receives report on disappearance of material objects in ayesha murder case

  అయేషామీరా హత్యకేసు పునర్విచారణ యోచనలో హైకోర్టు?

  Nov 13 | 2007 లో సంచలనం సృష్టించిన ఫార్మసి విద్యార్థి ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబరులో ఆయేషామీరా హత్యాచారం చేయబడింది.... Read more

 • Shivraj singh chauhan s wife faces public ire while campainging

  ITEMVIDEOS: ప్రచారంలో పరాభవం.. సీఎం సతీమణికి కూడా తప్పలేదు..

  Nov 13 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అధికారంలో వున్న పార్టీల... Read more

Today on Telugu Wishesh