last day to register names in voters list ఓటరు నమోదుకు ఇవాళ ఆఖరు తేదీ: ఈసీ

Last day to register names in voters list of telangana

voter id apply, telangana voter registration last date, telangana voter registration, telangana voter list 2018, TELANGANA ASSEMBLY ELECTIONS, Telangana Elections, voter registration, change of address, new voter registration, rajat kumar, new voter, form 6, form 8, Telangana, Telangana elections latest, politics

Telangana Election officer onve again appeal to the people of the state to check their vote in the latest list, if name is not found then apply for the same as today is the last day to register as voter.

ఓటరు జాబితాలో మీ పేరుందా.? నమోదుకు ఇవాళ ఆఖరు తేదీ..

Posted: 11/09/2018 12:44 PM IST
Last day to register names in voters list of telangana

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికలలో మీరు ఓటు వేయాలంటే.. ఓటరు జాబితాలో మీ పేరు వుందా.? లేదా.? అన్నది మరోసారి చెక్ చేసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ మరోమారు తెలంగాణ ప్రజలను కోరారు. ఇవాళ్టితో ఓటు నమోదు కార్యక్రమం ముగుస్తున్న క్రమంలో ఓటరుగా నమోదు చేసుకోని వారు.. అడ్రస్ మార్చిన వారు తమ ఓట్లను జాబితాలో చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

ఓటరు జాబితాలో మీ పేరు లేని పక్షంలో తక్షణం ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికీ ఓటు పొందనివారు, జనవరి 1, 2018కి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫొటో, వయసు ధ్రువీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులతో మండల కేంద్రాలు, పంచాయితీలు, కలెక్టరేట్ సహాయ కేంద్రాలు, బీఎల్‌వో వద్ద ఓటు నమోదు చేసుకునేందు అవకాశం కల్పించారు.

ఇప్పటికీ ఓటర్లుగా నమోదు చేయించుకోనివారు త్వరగా నమోదు చేసుకోవాలని, ఇంటి నెంబర్లలో మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని కోరారు ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లు తొలిగిస్తున్నట్టు చెప్పారు. 52,100 ఈవీఎంలు, 32,590 వివి ప్యాట్ యంత్రాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈవీఎంలు అన్నీ బాగానే పనిచేస్తున్నా.. వీవీ ప్యాట్ యంత్రాల్లో 7,8 శాతం పని చెయ్యడం లేదన్నారు. సెప్టెంబర్ 25తో ఓటు నమోదు గడువు మూగిసినా.. పేర్ల సవరణ, చిరునామా మార్పు, తదితర ఇతర సవరణలకు ఈసీ గడువును ఈ నెల 9 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఓటు నమోదు, సవరణల ఫారాలు ఇవే..
* ఫారం 6 - ఇప్పటి వరకూ ఓటు నమోదు చేసుకోని కొత్త ఓటర్లు ఈ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
* ఫారం 7- ఓటరు కార్డు తొలగింపు కోసం ఈ ఫారం వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయినా, వేరే నియోజకవర్గానికి మారినా.. వేరే చోటికి బదిలీ అయినా ఈ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles