TRS leader 'stoned to death' near Hyderabad పరిగిలో టీఆర్ఎస్ నేత దారుణ హత్య..

Trs leader stoned to death near hyderabad

TRS leader stoned to death, Parigi TRS leader murder, Rammohan Reddy, Harishwar Reddy, Narayan reddy, followers, Subash chander Reddy, TRS, Congress, Sultanpur village, Parigi assembly constituency, Vikarabad, Telangana, TRS leader Murder, Crime

A TRS leader P Narayan Reddy was murdered and two Congress workers injured in retaliatory violence in Sultanpur village of Parigi in Vikarabad

పరిగిలో టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డి దారుణ హత్య..

Posted: 11/06/2018 01:31 PM IST
Trs leader stoned to death near hyderabad

అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న క్రమంలో గ్రామాల్లో నేతల మధ్య కూడా విద్వేషాలు రగిలిపోతున్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా వుండే తెలంగాణ జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ తరహా రాజకీయాలను నేతలు పెంచిపోషిస్తున్నారా.? అనే అనుమానాలు వచ్చేలా వికారాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత హత్య జరిగింది. టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డి ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి పోలానికి వెళ్తున్న క్రమంలో ప్రత్యర్థులు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సుల్తాన్ పూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులను అలుముకునేలా చేసింది. ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ దాడికి వెనుక వున్నది ఎవరని తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నారాయణరెడ్డి హత్య విషయం గ్రామంలోని ఆయన వర్గీయులకు తెలియగానే వారు ప్రత్యర్థి వర్గానికి చెందని నేతలపై దాడులకు పాల్పడ్డారు.

గత కొంతకాలం వరకు నారాయణరెడ్డికి ప్రధాన అనుచరులు సుభాష్ చందర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడి ఇంటిపైకి వెళ్లిన నారాయణరెడ్డి వర్గీయులు వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి.. కాంగ్రెస్ నేతలను రక్షించారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. హతుడు నారాయణరెడ్డి గతంలో నార్‌మ్యాక్స్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

అయితే ఆ సమయంలో గ్రామంలోని కొందరు యువకులతో ఆయనకు గొడవలు ఏర్పడ్డాయి. మరోవైపు, నారాయణరెడ్డి అనుచరులు కొందరు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా పరిస్థితి వేడెక్కింది. ఈ క్రమంలో నారాయణరెడ్డిని అంతం చేయాలని భావించిన ప్రత్యర్థులు ఉదయం పొలానికి వెళ్తున్న ఆయనపై రాళ్లు, కర్రలతో దాడిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు జరిగి ప్రమాదం ఉందని భావించి.. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీసుల్ని మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తో గ్రామస్థులు వణికిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narayan reddy  Subash chander Reddy  TRS  Congress  Sultanpur village  Parigi  Vikarabad  Crime  

Other Articles