Pawan Kalyan on YS Jagan pada yatra సీఎంగారూ.. ఇదుగొండి రుజువు: పవన్ కల్యాణ్

Pawan kalyan on ys jagan praja sankalpa yatra

pawan kalyan, janasena, east godavari, chandrababu, Twitter, titli syclone, PM Modi, Letter, nara lokesh, panchayat raj ministry, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan gives CM Chandrababu naidu a proof of his letter to centre requesting to release relief measures fund to the victims of titli cyclone, through his twitter account.

జగన్ పాదయాత్రపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/06/2018 03:17 PM IST
Pawan kalyan on ys jagan praja sankalpa yatra

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని విపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయత్రపై సంచలన కామెంట్ చేశారు. దాదాపుగా 300 రోజులకు పైగా సాగిన జగన్ పాదయాత్రపై పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ప్రతిపక్ష నేత స్థానంలో వున్న జగన్.. ప్రజల మధ్య కాకుండా ప్రజల కోసం చట్టాలను చేసే చట్టసభలో వుండివుంటూ ప్రజలకు మేలు జరుగుతుందని తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. ఇవాళ పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన జగన్ పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు. విపక్ష నేత అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లపై తిరుగుతుంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నేతలకే వ్యవస్థలపై నమ్మకం లేకుండా పోతే.. ఇక ప్రజలకు వాటిపై నమ్మకాన్ని ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులను కులాల వారీగా కాకుండా, వారి వ్యక్తిత్వం ఆధారంగా, సేవాగుణం తెలుసుకుని వారిని ఎన్నుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని తమ జేబులోని సోమ్ములా భావించిన పాలకులు వారిష్టం వచ్చినట్టు సెల్ఫ్ చెక్కులు మాదిరి రాసేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. విద్య, వైద్యం ప్రజలందరికీ ఉచితంగా అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని పవన్ కల్యాన్ మరోమారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పవన్ సమక్షంలో పలువురు వైద్యులు పార్టీలో చేరడంతో వారికి ఖండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో వైద్యులు భాగమైనప్పుడే వారికి ప్రశ్నించే హక్కు వస్తుందని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే కనుక ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లాలని, నచ్చిన వారికే ఓటు వేయండని సూచించారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే హక్కు తనకు ఉందని, తనను ఎవరూ అడ్డుకోలేరని పవన్ స్పష్టం చేశారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారని నారా లోకేష్ పై పవన్ విమర్శలు గుప్పించారు.

ఉత్తరాంద్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరాలపై తిత్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో కేంద్రానికి అప్పట్లో ఆయన రాసిన లేఖను తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదిగో సాక్ష్యం అంటూ అంటూ ఆయన దీనిని పోస్టు చేశారు. తిత్లీ తుపాను నేపథ్యంలో పవన్ కల్యాన్ కేంద్రానికి లేఖ అయినా రాశారా? అని సీఎం చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించిన ఆయన ఈ మేరకు తాను రాసిన లేఖను తన అకౌంట్లో వుంచారు.

‘‘సీఎం గారూ.. తిత్లీ బాధితులను ఆదుకోవాలని నేను ప్రధానికి లేఖ కూడా రాయలేదని మీరు నాపై విమర్శలు చేశారు. ఇదిగో సాక్ష్యం’’ అంటూ ఆ లేఖను జత చేశారు. ఏపీలో అధిక శాతం ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభుత్వం వైపే ఉందని, దాన్ని నియంత్రిస్తూ తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. తిత్లీ బాధితులకు పరిహారం పంపిణీ సందర్భంగా నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  chandrababu  nara lokesh  andhra pradesh  politics  

Other Articles