'Titli' intensifies into severe cyclonic storm రేపు ‘తిత్లీ’ తీరం దాటే అవకాశం.. తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్

Deep depression intensifies into cyclonic storm titli imd issues red alert

India Meteorological Department, 'Titli', severe syclonic storm, cyclone titli, odisha, Andhra Pradesh, gopalpuram, Kalingapatanam, National Disaster Response Force, CYCLONE

'Titli' intensified into a severe cyclonic storm today and is moving towards the Odisha-Andhra Pradesh coast, triggering rainfall in several parts of Odisha, the (IMD) said.

రేపు ‘తిత్లీ’ తీరం దాటే అవకాశం.. తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్

Posted: 10/10/2018 02:30 PM IST
Deep depression intensifies into cyclonic storm titli imd issues red alert

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై విరుచుకుపడటానికి మరో భయంకర తుఫాన్ సిద్ధంగా ఉంది. తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించడానికి దూసుకువస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపం దాల్చింది. దీనికి ‘తిత్లీ’గా నామకరణం చేశారు. ఈ ‘తిత్లీ తుఫాన్ ఇప్పుడు ఉత్తరకోస్తా జిల్లాలతో పాటు ఒడిశాలోని తీరం వెంబడి ఉన్న నాలుగు జిల్లాల్లో తన ప్రతాపం చూపించనుంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశా గోపాలపురం వద్ద తిత్లీ తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఒడిశా ప్రభుత్వానికి సూచించింది.

ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఈ నాలుగు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తితిలీ తుఫాన్ కారణంగా రాగల 24 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చేపలు పట్టేవారు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఇక గుడిసెలు, పూరిళ్లలో వుండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

తిత్లీ తుఫాన్ తీరం దాటే సమయంలో తీర ప్రాంతమంతా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరికలు జారీ చేసింది. వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సముద్ర అలలు ఎగసిపడతాయి. ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురంలోని ముక్కాం వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు చొచ్చుకువచ్చింది. తిత్లీ తుఫాన్ ప్రస్తుతం గోపాల్ పూరంకు ఆగ్నేయంగా 370 కిలీమీటర్ల దూరంలో, కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీరం దిశగా వచ్చే క్రమంలో మరింత బలపడి రానున్న 15 గంటల్లో తీవ్ర పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. గురువారం కలింగపట్నం, గోపాల్ పూర్ మధ్య ‘తిత్లీ’ తీరం దాటనుంది.

రానున్న 12 గంటల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో సముద్ర తీరాలు అల్లకల్లోలంగా మారతాయని తెలిపింది. మరోవైపు కళింగపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుఫాన్ హెచ్చరికతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నుంచి ఉత్తరాంధ్రకు నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles