IT raids on Delhi minister Kailash Gahlot మంత్రి నివాసంపై ఐటీ అధికారుల దాడులు

Delhi minister kailash gahlot raided cm arvind kejriwal hits out at centre

IT raids on Delhi minister, IT raids on delhi transport minister, It Raids ministerts house, Kailash Gehlot, Income Tax, Delhi transport minisrty, AAP, Delhi government, Arvind Kejriwal, Delhi, Politics

Income tax authorities are carrying out searches at 16 locations linked to Delhi Transport Minister Kailash Gahlot including his Vasant Kunj house.

మంత్రి నివాసం సహా 16 ప్రాంతాలపై ఐటీ దాడులు

Posted: 10/10/2018 01:30 PM IST
Delhi minister kailash gahlot raided cm arvind kejriwal hits out at centre

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మరోమారు కేంద్రం షాక్ ఇచ్చింది. అప్ పార్టీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అడపాదడపా కేంద్రం నుంచి లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి మొదలు అన్ని రకాలుగా షాకులు తిన్న ప్రభుత్వానికి తాజాగా కొంతకాలం తరువాత అప్ మంత్రిపై ఆదాయ పన్ను దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా అప్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు మంత్రులు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ తరహా దాడులను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ నిర్వహించింది.

ఇక తాజాగా ఢిల్లీ రాష్ట్ర రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పన్నుల ఎగవేత ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో గల మంత్రి నివాసంతో పాటు దేశ రాజధాని చుట్టుపక్కల దాదాపు 16 ప్రాంతాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంత్రికి చెందిన బ్రిస్ఖ ఇన్  ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్, కార్పోరేట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలపై కూడా దాడులు జరిగాయి.

వసంత్ కుంజ్ లోని మంత్రి నివాసం, ఢిఫెన్స్ కాలనీ, ఆయనకు చెందిన పశ్చిమ్ విహార్, నజాఫ్ గర్, లక్ష్మీ నగర్, పాలమ్ విహార్, గుర్ గ్రామ్ లోని పలు ప్రాంతాలలో అదాయశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారు జామునుంచే అధికారులు దాడులను నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు సంబంధికులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, తన మంత్రివర్గంలోని కీలక సభ్యుడైన కైలాష్ గెల్హాట్ నివాసం, కార్యాలయాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఢిల్లీలో తాము బీజేపి అంచనాలను తారుమారు చేసి ప్రభుత్వాన్ని చేపట్టిన నాటి నుంచి కేంద్రంలోని ప్రభుత్వం తమను రాజకీయంగా ఎదుర్కోలేక తమ ప్రభుత్వంపై ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తుందో.. స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖలను తమపైకి ఎలా ఉసిగోల్పుతుందో తాము అన్ని గమనిస్తున్నామని.. ప్రజల నుంచి చిత్కారాలను ఎదుర్కోన్న బీజేపి మాత్రం ఇంకా తమ పద్దతిని మార్చుకోవడం లేదని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles