political parties condemmed MLA and Ex Mla murder ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై స్పందించిన నేతలు

Maoist attack political parties condemmed mla and ex mla murder

MLA Kidari murder, MLA KSarveswara Rao, Ex MLA saveri Soma, KTR, JanaSena, BJP, Visakhapatnam, Araku Valley, Vizag city, Maoist sympathisers, Special Operation Team, Dumbriguda S.I, suspension, DGP Tagore, Andhra Pradesh, Politics

After the attack by Maoists on Araku MLA Kidari Sarveshwar rao and ex mla Soma, political parties condemmed this act by naxals.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై స్పందించి నేతలు

Posted: 09/24/2018 04:32 PM IST
Maoist attack political parties condemmed mla and ex mla murder

విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనపై తెలుగు రాష్ట్రాలలోని పలు పార్టీలు ఈ హత్యలను ఖండించాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో షాక్‌కు గురయ్యానని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. 'ఇద్దరు నేతల హత్యతో చాలా ఆవేదనకు గురయ్యా. సివేరి సోమ నాకు 2009-14 మధ్య అసెంబ్లీలో సహచరుడు. బాధాకరమైన ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు నేతల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణ ఎన్నికలకు వినియోగించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. 2014 తర్వాత ఏపీలో పోలీస్, నిఘా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు. పోలీసులు ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారని కన్నా తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.

నిన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరు అధికార పార్టీ నేతలను మావోయిస్టులు దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు, ఎమ్మెల్యే మద్దతుదారులు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు చావబాదారు. అనంతరం బయట ఉన్న పోలీస్ ఔట్ పోస్టుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు, ఫైళ్లు కాలి బూడిదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి కారణంగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ప్రాణాలు పోయాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) అభిప్రాయపడింది. సర్వేశ్వర రావు, సోమల మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అరకు నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడ గ్రామంలో అక్రమంగా సాగుతున్న క్వారీ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలిద్దరు ఇవాళ ప్రాణాలతో ఉండేవారని అభిప్రాయపడింది.

ఉత్తరాంధ్ర పోరాటయాత్రంలో భాగంగా గూడ గ్రామస్తుల విజ్ణప్తి మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గ్రామాన్ని సందర్శించి.. వారి బాధను అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని క్వారీ మూసివేతకు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్యాక్ గుర్తు చేసింది. అక్కడి క్వారీ తవ్వకాల మూలంగా తాగునీటి వనరులు కలుషితమైన తీరుని అక్కడి గ్రామస్తులే పవన్ కల్యాణ్ కి చూపించిన విషయాన్ని, తమ ఇళ్ళు దెబ్బతింటున్న విషయాన్ని, తాముపడుతున్న ఇబ్బందులనీ తెలియజేయడాన్ని ప్యాక్ గుర్తు చేసింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అక్రమ మైనింగ్ వ్యవహారాలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్యాక్ డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla kidari sarveswara Rao  Ex MLA saveri Soma  KTR  JanaSena  BJP  Andhra Pradesh  Politics  

Other Articles