Kannada actor arrested on assault charge నటుడి ఇద్దరు భార్యలు.. గొడవపడి ఠాణాలకెక్కారు..

Kannada actor duniya vijay arrested for abducting and assaulting his gym trainer

Bangalore court, Duniya Vijay, Duniya Vijay news, Gym Trainer, judicial custody, Kannada actor crime, Kannada Actor Duniya Vijay, Kannada actor news, Kannada films, Sandal wood, Maruthi Gowda, Crime

Actor Duniya Vijay got into a scuffle with his gym trainer Maruthi Gowda on Saturday night, after which Vijay and his friends allegedly abducted Maruthi and assaulted him through the night.

నటుడి ఇద్దరు భార్యలు.. గొడవపడి ఠాణాలకెక్కారు..

Posted: 09/24/2018 03:28 PM IST
Kannada actor duniya vijay arrested for abducting and assaulting his gym trainer

వివాదాల్లోకి వెళ్లడం .. అవి కాస్తా రచ్చగా మారి చివరకు పోలీసు కేసులు కూడా నమోదు కావడంతో కన్నడ హీరో 'దునియా' విజయ్ ను అరెస్టు చేయడం జరుగుతున్నాయి. తాజాగా ఆయన ఇప్పుడు కిడ్నాప్, దాడి కేసులో అరెస్టు అయ్యారు. జిమ్ ట్రైనర్ మారుతి గౌడతో వాగ్వాదానికి దిగి, ఆయన్ను కొట్టిన ఘటనలో విజయ్‌ తోపాటు మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 323, 504, 506, 34సెక్షన్‌లకింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో పోలీసులు దునియా విజయ్ ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదే సమయంలో ఆయన ఇద్దరు భార్యలు తామేం తక్కువకాదంటూ.. విజయ్ భాటలోనే నడిచారు.

అయితే వీరు బయటి వ్యక్తులతో గొడవలు పడ్డారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఇద్దరూ ఒకరపై ఒకరు పోలీసు స్టేషన్లకు వెళ్లి పిర్యాదులు చేసుకున్నారు. పెద్ద భార్య నాగరత్న, చిన్న భార్య కీర్తి గౌడలు గొడవ పడ్డి.. ఏకంగా ఠాణాలెక్కారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కన్నడ హీరో దునియా విజయ్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నాగరత్నకు ముగ్గురు పిల్లలు. అయితే గత కొంతకాలం కిందట.. విజయ్‌ కీర్తిగౌడతో పరిణయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కూడా తన చిన్నభార్య కీర్తి గౌడతోనే ఉంటున్నాడు. మారుతి గౌడతో గొడవ జరిగిన వేళ, నాగరత్న కుమారుడు సామ్రాట్ తన తండ్రితో కలసి కీర్తి గౌడతోనే వున్నాడు.

‌పోలీసులు తన భర్తను అరెస్టు చేసి తీసుకెళ్లిన తరువాత కూడా తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీసీంది. తన కుమారుడ్ని తన ఇంటికి పంపించాల్సిందిగా డిమాండ్ చేసింది. ఈ క్రమంలో కీర్తి గౌడ్ దగ్గరుండే బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారట.తన సంసారాన్ని కీర్తిగౌడ నాశనం చేసిందని, ఇప్పుడు పిల్లల్ని దూరం చేస్తోందని ఆరోపిస్తూ, తనపై బౌన్సర్లతో దాడి చేయించిందని గిరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసును నమోదు చేసుకునేలోగా, కీర్తిగౌడ కూడా పోలీ‌స్‌ స్టేషన్‌ కు వెళ్ళి, నాగరత్న తన ఇంటిపై దాడి చేసిందని ప్రతి ఫిర్యాదు చేసింది. ఓ వైపు భర్త విజయ్, అరెస్టయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేళ, ఆయన భార్యలిద్దరూ ఇలా రోడ్డెక్కి వివాదాన్ని పెంచడం చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore court  Duniya Vijay  Gym Trainer  judicial custody  Maruthi Gowda  Crime  

Other Articles