dharmabad court orders CBN to appear before It చంద్రబాబుకు షాక్.. ‘‘అందరూ హాజరుకావాల్సిందే’’

Setback to ap cm chandrababu court orders to appear before it

Andhra Pradesh CM, CM Chandrababu, Dharmabad Court, Babli project, Recall Petition, non bailable warrant, Gangula Kamalakar, KS Ratnam, Prakash Goud, TRS, TDP, Maharastra, crime

Dharmabad Court has rejected the Recall Petition filed by Andhra Pradesh CM Chandrababu Naidu and clarified that he should attend before the court on October 15th.

చంద్రబాబుకు షాక్.. ‘‘అందరూ హాజరుకావాల్సిందే’’

Posted: 09/21/2018 12:59 PM IST
Setback to ap cm chandrababu court orders to appear before it

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధర్మాబాద్ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలెబుల్ వారెంటు నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాఖలు చేసిన రీకాల్ పిటీషన్ ను న్యాయస్థానం కోట్టివేసింది. ఈ కేసులో సంచలన అదేశాలను జారీ చేసిన న్యాయస్థానం.. చంద్రబాబు ముఖ్యమంత్రైనా.. న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సిందేనని అదేశించింది.

ముఖ్యమంత్రైనా.. సామాన్యుడైనా న్యాయస్థానం ఎదుట అందరూ సమానమేనని పేర్కోంటూ.. వ్యక్తులు వారి పదవులను బట్టి ఒక్కోక్కరిని ఒక్కో విధంగా తాము పరిగణించలేమని అందరూ ఈ కేసు విచారణ నేపథ్యంలో హజరుకావాల్సిందేనని అదేశించింది. చంద్రబాబు సహా మొత్తం 16 మంది న్యాయస్థానంలో హాజరుకావాల్సిందేనని పేర్కోంది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసిన న్యాయస్థానం.. ఆదే రోజున అందరూ హాజరుకావాల్సిందేనని అదేశించింది.

చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ.. పేర్కోన్న న్యాయస్థానం.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఎవరికీ కోర్టు నుంచి మినహాయింపులు ఉండవని చెప్పారు. తదుపరి విచారణకు నోటీసులు అందుకున్న వారందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. మరోవైపు కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ లపై అరెస్ట్ వారెంట్ ను రద్దు చేసి, బెయిల్ మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Dharmabad Court  Babli project  Recall Petition  non bailable warrant  crime  

Other Articles