Tread cautiously in reporting rape: SC to media మీడియాపై పాట్నా హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేసిన ‘సుప్రీం’

Supreme court lifts ban on reporting of muzaffarpur shelter home rapes

Muzaffarpur shelter home case, supreme court, ban on media reporting on muzaffarpur shelter, patna high court, shelter home sexual abuse case, muzaffarpur rapes, shelter home rapes, patna High Court, Supreme Court, Sexual assault, blanket ban, Media

There cannot be a “blanket ban” on media reporting on cases of rape and sexual abuse but such incidents should not be sensationalised, the Supreme Court said.

ఆ కేసుల్లో సంచలనాలు కాదు సంయమనం పాటించాలి: సుప్రీంకోర్టు

Posted: 09/21/2018 12:34 PM IST
Supreme court lifts ban on reporting of muzaffarpur shelter home rapes

అత్యాచార కేసుల్లో సంచలనాలకు తెరలేపుతూ వార్తలను కవర్ చేయడం కన్నా సంయమనంతో వ్యవహరించాల్సిన బాధ్యత తమపై వుందని మీడియా గ్రహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఓ వైపు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే మీడియా తీర్పులను చెప్పేలా కథనాలను రాయడం సరికాదని సూచిస్తూనే, ఈ విషయంలో మీడియా కూడా తమ గురుతర బాధ్యతనెరిగి వ్యవహరించాలని సూచించింది. ఈ క్రమంలో బీహార్ లోని పాట్నా హైకర్టు మీడియాపై విధించిన నిషేధాన్ని సుప్రిం కోర్టు ఎత్తివేసింది.

వసతి గృహాల్లో వెలుగు చూసిన అంశాలపై వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ నివేదితా ఝా అనే పాత్రికేయురాలు దాఖలు చేసిన పిటీషన్ విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు మీడియాకు సూచనలు జారీ చేసింది. పిటిషన్‌ విచారించిన అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం.. లైంగిక దాడి కేసుల్లో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం సరికాదని వ్యాఖ్యానించింది.

బీహార్‌ వసతి గృహాల్లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనలపై వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేస్తూనే.. మీడియా కూడా తమకున్న మార్గదర్శకాలకు, పరిమితులకు లోబడే కథనాలను వెలువరించాలని సుప్రీం కోర్టు అదేశించింది. కాగా, బీహార్ ఘటనలో దారుణాలను వెలుగులోకి తెచ్చింది మీడియానే అని అత్యున్నత న్యాయస్థానానికి తన పిటీషన్ ద్వారా తెలిపారు నివేదితా ఝా. దీనిపై న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ.. ‘తప్పుతోవ పట్టించే వార్తల విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవనిపిస్తోందని అభిప్రాయపడింది. దీనిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌, ఎన్‌బీఎస్‌ఏకు సమాచారం అందిస్తామని జస్టిస్‌ లోకూర్‌ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles