dangerous ride on train's roof ఇలా రైలు ప్రయాణం చేయాగలరా..

Viral video passengers dare ride on train s roof and a smooth way down

Viral video, Joyride, Train, Trains roof, Board, Deboard, Railway, Indian railways, Bangladesh railways, crime

A video that has gone viral on social media shows some people travelling on the roof of a train. They can be seen getting down the roof by sliding on a pole where the train has stopped.

ITEMVIDEOS: ప్రయాణం పట్టు తప్పితే ప్రమాదం.. అయినా తప్పదు పయనం

Posted: 07/30/2018 12:43 PM IST
Viral video passengers dare ride on train s roof and a smooth way down

రైలు ప్రయాణం చేయడమంటే చాలా మందికి సరదా. చాలా మంది దూరప్రాంతాలకు వెళ్లలాంటే ఎంచుకునే రవాణామార్గం కూడా రైలే. అందుకు రైలు ప్రయాణంలో అలసట ఉండకపోవడం ఒక కారణం అయితే టికెట్ ధర కూడా ఇతర రావాణాలతో పొల్చకుంటే తక్కువగానే వుంటాయి. అయితే బంగ్లాదేశ్ లో మాత్రం రైలు ప్రయాణం అంటేనే భయమేస్తుంది. చూడటానికి ఔరా అనిపించేలా వున్న ఈ ప్రయాణం.. చేయాలంటే మాత్రం అమ్మో అనాల్సిందే.

ఇంతకీ ఏమిటీ విచిత్రం అంటారా.. బంగ్లాదేశ్ లో రైలు ప్రయాణికులు చాలా మంది రైలు పైన ప్రయాణం చేస్తుంటారు. అదేంటి అంటే రైలు రూఫ్ పైన ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడా లేని సమానత్వం మాత్రం ఇక్కడ కల్పిస్తారు. ఈ ప్రయాణం చేయడానికి పురుషులతో పాటు తాము రెడీ అంటున్న మహిళలకు సహకారం కూడా లభిస్తుంది. అయితే ఇలా ప్రయాణం చేయడం ప్రమాదమని తెలిసినా తప్పదని చేస్తున్నారు. తాము గమ్యస్థానాలకు చేరాలన్నది ముఖ్యమే అయినా.. క్షేమంగా చేరాలన్నది కూడా ముఖ్యమన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

అసలు తమ దేశంలో రైలు ప్రయాణాలు ఇంత దారుణంగా వున్నాయిన కనీసం ప్రభుత్వానికి కూడా తెలుసా.? తెలియదా.? అన్న విషయంలో స్పష్టత లేదు కానీ.. ప్రయాణికులు రైలు నుంచి దిగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దానిని పరిశీలిస్తే మాత్రం వారంతా అలవోకగా రైలు నుంచి కిందకు దిగుతున్నారు. మరీ వీళ్లు రైలు పైకి ఎలా ఎక్కరంటే మాత్రం తెలియదనే చెప్పాలి. చెట్లు, బ్రిడ్జీలు, కల్వర్టులు ఇత్యాదులు తగిలి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా కూడా మారుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోరా.? అని వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Viral video  Joyride  Train  Trains roof  Board  Deboard  Railway  Indian railways  Bangladesh railways  crime  

Other Articles