devotees are not happy, matangi at rangam ‘‘నాకు బంగారు బోనం.. నా భక్తులకు దు:ఖమా.?’’

Matangi says her devotees are not happy at rangam bhavishyavani

bhavishyavani, Rangam, Bonalu, matangi, swarnalatha ammavaru, bangaru bonam, devotees, ujjaini mahankali temple, secundrabad bonalu, telangana

Matangi swarnalatha says her devotees are not happy, golden bonam will make her partial happy, but devotees are her foremost proirity, says the government to take of them instead, at rangam bhavishyavani

‘‘నాకు బంగారు బోనం.. నా భక్తులకు దు:ఖమా.?’’

Posted: 07/30/2018 01:32 PM IST
Matangi says her devotees are not happy at rangam bhavishyavani

నాకు బంగారు బోనం సమర్పించి.. నా భక్తులకు మాత్రం దు:ఖంలోనే వుండనిస్తారా.? నా భక్తులే నాకు ముఖ్యం.. వారినే ముందుగా పట్టించుకోండి.. వారే నా ప్రాధాన్యం.. అంటూ మాతాంగి స్వర్ణలత అమ్మవారు ఇవాళ కాసింత అగ్రహాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు బోనాల కార్యక్రమం ఘనంగా జరిగడం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున బంగారు బోనాన్ని సమర్పించిన క్రమంలో అమ్మవారు ఇవాళ జరిగిన రంగం వేడుకలో మాతాంగి స్వర్ణలత.. అమ్మవారిని అవహించుకుని భవిష్యవాణి వినిపించారు.

లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, భవిష్యవాణిని వినిపిస్తూ.. ఈ ఏడాది బంగారు బోనం కొంత సంతోషం, కొంత దుఃఖం కలిగించిందన్నారు. 'బంగారు బోనం సమర్పించారు అని సంతోష పడుతున్నారు ..కానీ నాది నాకే సమర్పించారు. నాకు ఎవ్వరూ బంగారు బోనం పెట్టలేదు. నాది నేనే తెచ్చుకున్నాను. బంగారు బోనం సమర్పణ జరిగినా..నేను దుఃఖంతో ఉన్నాను. నా సన్నిధికి భక్తులు దుఃఖంతో వస్తున్నారు, దుఃఖఃతో పోతున్నారు. ప్రజలకు మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు..కానీ కీడు చేస్తున్నారు.

ఇదే క్రమంలో ప్రజలను మీరు ఇబ్బంది పెట్టినా..నేను మాత్రం సంతోషంగా చూసుకుంటాను. నా ఆశీర్వాదం అందరికీ ఉంటుంది... అంటూ సెలవిచ్చారు. తనకు మాత్రమే మొక్కులు పెట్టడం కాదు.. ప్రజలను సంతోషపెట్టండి. ఇకనైనా వారు ఇబ్బందులకు గురికాకుండా చూసుకోండి' అంటూ సూచించారు. ప్రజలంతా తన బిడ్డలేన్న 'మాతంగి'.. ఈ ఏడాది అనుకూలమైన వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండుతాయని తెలిపారు. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారు ఆకాక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhavishyavani  Rangam  Bonalu  matangi  ujjaini mahankali temple  telangana  

Other Articles