Eight decade-old bus shelter collapses in Hyderabad కుప్పకూలిన నిజాం కాలం నాటి బస్ షెల్టర్..

Nizam era mississippi aircraft hanger comes down crashing in hyderabad s gowliguda

RTC bus shelter collapse, CBS shelter collapse, Gowliguda bus station collapsed, RTC bus shelter, CBS shelter, nizam nawab, Mississippi aircraft hanger, collapse, Gowliguda, Hyderabad

The eighty-eight-year-old Nizam-era "Mississippi aircraft hanger" which stood the test of time and years of neglect despite being a busy bus station near river Musi in Gowliguda finally has come down crashing

కుప్పకూలిన నిజాం కాలం నాటి బస్ షెల్టర్..

Posted: 07/05/2018 02:12 PM IST
Nizam era mississippi aircraft hanger comes down crashing in hyderabad s gowliguda

కాలగర్భంలో అనేక వారసత్వ సంపదలు కలసిపోతున్నాయి. తాజాగా నిజాం నవాబు కాలం నాటి నిర్మాణం కూడా కుప్పకూలిపోయింది. అనేక దశాబ్దాల పాటు హైదరాబాద్ ప్రజలకు బస్టాండుగా సేవలందించి, ప్రస్తుతం సిటీ బస్టాండ్ గా ఉన్న సీబీఎస్ (సెంట్రల్ బస్ స్టేషన్) ఈ ఉదయం కుప్పకూలింది. గౌలిగూడలో మూసీ నది పక్కన ఉన్న ఈ భారీ డోమ్ ఇవాళ వేకువ జామున కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో కొందరికి స్వల్పగాయాలు అయినట్టు తెలుస్తోంది.

సుమారు ఎనభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోమ్ కూలిపోతుందని గత నెల 30వ తేదీన అర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకుని అదేశాలు జారీ చేయడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే దశాబ్దకాలనికి పైగా ఈ బస్టాండ్ నిరాధరణకు గురైంది. అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణంగానే చారిత్రక సంపద కుప్పకూలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిగా కుప్పకూలే స్థితికి చేరుకునే వరకు అధికారులు ఎలాంటి మరమ్మత్తులు, పెయింటింగ్ వేయకుండా వదిలేయడంతోనే చారిత్రక బస్టాండ్ ఇలా కుప్పకూలిందని విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

కాగా, ఈ బస్టాండును తొలగించాలన్న ప్రతిపాదనలు సిద్దం చేశామని, వాటిని అచరణలో పెట్టేలోపే అది కుప్పకూలిపోయిందని అధికారులు తాపీగా సమాధానం ఇస్తున్నారు. మూసీ నది మధ్యలో ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) నిర్మించిన తరువాత, హైదరాబాద్ బస్టాండును సీబీఎస్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల వేళ, అధిక రద్దీని తట్టుకునేందుకు సీబీఎస్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడుపుతూ ఉండేవారు.

ఇది అసలు బస్టాండు కానేకాదు..

సెంట్రల్ బస్ స్టేషన్ అనేది ఎలా వాడుకలోకి వచ్చింది. అసలు ఈ బస్టాండు అకారం ఎలా వచ్చింది అన్న ప్రశ్నలు ఇప్పటి వారికి ఉత్పన్నం కాకమానవు. తెలంగాణలోని నిజాం సర్కారుపై ఇండియన్ అర్మీ యుద్దం ప్రకటించి.. భారత ప్రభుత్వం ఈ ప్రాంతానికి విముక్తి కల్పించిన ఆనంతరం ఈ ప్రాంతంలోని ఈ కట్టడం బస్టాండుగా మారింది. అంతకుముందు దీనిలో నిజాం నవాడు తన దూరప్రాంతాలకు వెళ్లేందుకు వినియోగించి మిస్పిస్సిప్పీ ఎయిర్ క్రాప్ట్ ను వుంచేందుకు ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇది చరిత్ర.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles