kadapa studend plays kidnap drama to marry professor పేరెంట్స్ కు కిడ్నాప్ మెసేజ్.. ప్రియుడితో లవ్ మ్యారేజ్

Kadapa studend plays kidnap drama to marry professor

lakshmi prassanna, sai keshave reddy, proffessor, whatsapp, kidnap drama, rape attempt, student parents police, kadapa student drama, kadapa student love marriage, love marriage, crime

kadapa student lakshmi prasanna makes parents and police on their toes by sending a whatsapp message to her sister stating that someone kidnaped her. another message states that she got love married to a proffessor

పేరెంట్స్ కు కిడ్నాప్ మెసేజ్.. ప్రియుడితో లవ్ మ్యారేజ్

Posted: 07/05/2018 12:56 PM IST
Kadapa studend plays kidnap drama to marry professor

తనను ఎవరో కిడ్నాప్ చేశారని, రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాట్స్ యాప్ లో మెసేజ్ పంపి అటు కన్నవారిని, ఇటు పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన లక్ష్మీ ప్రసన్న తాను ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునేందుకే ఈ బూటకపు నాటకానికి తెరతీసిందని తెలుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకోగా, తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ చేసిన పనికి తీవ్రంగా భాధపతున్నారు. తమ బిడ్డ తమను కంగారు పెట్టించి మరీ అమె మాత్రం తన స్వార్థం చూసుకుని వెళ్లిపోయిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రియుడితో వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్న లక్ష్మీప్రసన్న, ఈ కిడ్నాప్ డ్రామా ఆడిందని పోలీసులు తెలుసుకున్నారు. అయితే అమె తాను ప్రేమించిన యువకుడినే ప్రేమ వివాహం చేసుకున్నట్లు అమె మరో మారు వాట్సాఫ్ ద్వారా సమాచారం అందించింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కడప నగర శివార్లలో ఉన్న ఓ ప్రైవేటు విద్యాసంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న  అట్ల సాయికేశవ్‌ రెడ్డి అనే యువకుడిని, అదే కాలేజీలో చదువుకుంటున్న లక్ష్మీ ప్రసన్న ప్రేమించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు.

ఓ బురఖా ధరించి, కడప బస్టాండ్ నుంచి కర్నూలుకు బయలుదేరిన ఆమె, ఆళ్లగడ్డలో ప్రియుడిని కలిసింది. ఇద్దరూ కలసి నంద్యాల మీదుగా హైదరాబాద్ వెళ్లి, ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను, ఓ వీడియోను రికార్డు చేసి పోలీసులకు, స్నేహితులకు పంపించారు. తాను ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని, ఎవరి బలవంతం లేదని, తన గురించి వెతకవద్దని తెలిపింది. యువతి ప్రేమ వివాహం చేసుకున్నట్టు సమాచారం వచ్చిందని చెప్పిన కడప చిన్న చౌక్ సీఐ రామకృష్ణ, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిడ్నాప్, అత్యాచారం అంతా డ్రామాయేనని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lakshmi prassanna  sai keshave reddy  proffessor  whatsapp  kidnap drama  love marriage  crime  

Other Articles