Danam Nagender quits Cong., to join TRS ఆత్మాభిమానం లేని చోట ఉండలేక రాజీనామా: దానం

Senior leader danam nagender resigns to congress

Congress, Danam Nagender, Danam Nagender resign, hyderabad, Telangana Congress, TRS, YS Rajashekar reddy, KCR, CM, telangana, politics

Telangana senior Congress leader and former minister Danam Nagender resigned from the party. He alleges there is no self respect for bc leaders in the party.

ఆత్మాభిమానం లేని చోట ఉండలేక రాజీనామా: దానం

Posted: 06/23/2018 02:59 PM IST
Senior leader danam nagender resigns to congress

ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో తిష్టవేసి.. బడుగుబలహీన వర్గాల నేతలను పట్టించుకోవడంలేదని, ఈ క్రమంలో ఆత్మాభిమానం లేని చోట.. మనజాలనని, మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంగ్రెస్ పార్టీని తాను వీడుతున్నానని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసిన తర్వాత ఆయన మొదటి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నారని, అయితే పార్టీలో ఉన్న కొందరు నేతలు ఇతర సామాజిక వర్గ నేతల్ని ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపంచారు.

పార్టీలో బీసీలకు ప్రాధాన్యం తగ్గుతోందని అందుకే బడుగు బలహీన వర్గాలకు చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారని దానం పేర్కొన్నారు. డి. శ్రీనివాస్, కేశవరావు లాంటి వారు పార్టీ వీడడానికి కారణమిదేనని ఆయన అన్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి కూడా పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో జరిగిన పార్టీ మీటింగ్‌కి పొన్నాల లక్ష్యయ్యకు సమాచారం లేకపోవడాన్ని బట్టి పార్టీలో బీసీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని దానం అన్నారు. పార్టీ సీనియర్ నేత హనుమంతరావు మింగలేక కక్కలేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీసీల జనాభా 1.67కోట్లని, ఎన్నికలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న బీసీలకు పార్టీ పదవుల్లో, అధికారాల్లో మాత్రం ప్రాధాన్యత లేదని దానం అన్నారు. ఈ విషయాన్ని తాను 6 నెలల క్రీతం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు, ఆయన కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అడిగినట్లు చెప్పుకొచ్చారు. అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు. పత్రికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా వార్త వస్తే సీఎం అభ్యర్థులంతా ఢిల్లీకి పరుగెత్తుతారని దానం ఎద్దేవా చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యే నిర్వహించిన బస్సు యాత్రపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకే బస్సుయాత్రలో ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ లా రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారని దానం అన్నారు. వైఎస్ తీసుకువచ్చిన 108, 104, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ వంటి పథకాలు ఆయనను పేదల గుండెల్లో నిలిచేలా చేశాయన్నారు. సీఎం కేసీఆర్ కూడా కళ్యాణలక్ష్మీ, గొర్రెల పంపకం, చేపల పంపకం లాంటి మంచి కార్యక్రమాలతో వైఎస్ లాంటి కీర్తిని కేసీఆర్ సంపాదించారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles