HC stays CAT order in Sindhuri case ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి ఎదురుదెబ్బ..!

Karnataka high court stays cat order in sindhuri case

Karnataka High Court, stay, judgment, Central Administrative Tribunal (CAT), State government’s order, IAS officer Rohini Sindhuri Dasari, transfer, Hassan Deputy Commissioner, interim order

The Karnataka High Court stayed the judgment of the Central Administrative Tribunal (CAT), which had upheld the State government’s order of transferring IAS officer Rohini Sindhuri Dasari from the post of Hassan Deputy Commissioner,

ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి ఎదురుదెబ్బ..!

Posted: 04/28/2018 12:28 PM IST
Karnataka high court stays cat order in sindhuri case

కర్ణాటకలోని హసన్ జిల్లా ఢిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తనను బదిలీ చేయడం అన్యాయంటూ ఐఏఎస్ అధికారిని దాసరి రోహిణి సింధూరి న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమె కర్ణాటక హైకోర్టు అశ్రయించగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వానికి అనుకూలంగా జారీ చేసింది. అయితే అంతకుముందు రోహిణి సింధూరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ను అశ్రయించగా, ప్రభుత్వ అదేశాలను పాటించాలని వెలువరించిన తీర్పుపై రాష్ట్రోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

2014లో ఐఎఎస్ క్యాడర్ అధికారుల బదిలీ విషయంలో కనీస కాలం స్థానికంగా విధులు నిర్వహించిన తరువాతే చేయాలన్న సవరణలను పాటించకుండా తనను హసన్ ఢిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారని అమె క్యాట్, ఆ తరువాత రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించారు. అయితే కర్ణాటక హైకర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో అమెకు ఎదురుదెబ్బ తగిలింది. క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో అమె తీవ్ర నిరాశకు గురైయ్యారు.

కర్ణాటకా న్యాయస్థానంలోని జస్టిస్ హెచ్ జీ రమేష్, జస్టిస్ శ్రీనివాస్ గౌడల ద్విసభ్య ధర్మాసనం ప్రాథమిక విచారణ జరిపి, తీర్పును ప్రకటించింది. ప్రభుత్వం బదిలీ చేసిన ఉద్యోగ, శిక్షణ శాఖ అధికారిగా బాధ్యతలను స్వీకరించాలంటూ హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన పదవిలోనే కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మే 30వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఎన్నికల సమయంలో తాను హసన్ లో వుండాలని అమె చేసిన పోరాటంలో అమెకు ఎదరుదెబ్బ తగిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles