Minister Ganta announces DSC for teacher posts ఉపాద్యాయ అశావహులకు శుభవార్త.. 10351 పోస్టులకు భర్తీకి సన్నధం

Minister ganta srinivasa rao announces dsc for teacher posts

minister ganta srinivasa rao, AP Government, Teacher posts, DSC, TET, chandrababu, andhra pradesh

Here is good news from Andhrapradesh government for aspirants of teacher posts. minister ganta seinivasa rao announces tet and dsc shedule for 10,000 teacher posts.

ఉపాద్యాయ అశావహులకు శుభవార్త.. 10351 పోస్టులకు భర్తీకి సన్నధం

Posted: 04/28/2018 11:40 AM IST
Minister ganta srinivasa rao announces dsc for teacher posts

నవ్యాంద్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ అశావహ నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 10 వేల 351 ఉపాధ్యాయ పోస్టులను మరో మూడు నెలలో భర్తీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ విశాఖపట్నంలో ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ కొలువుల కొరకు వేచిచూస్తున్న నిరుద్యోగ అశావహులకు మంత్రి గంటా శుభవార్తను అందించారు. ఏకంగా 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు, అ వెంటనే జులై 6వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు.

మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని తెలిపారు. జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్ లైన్ లో డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minister ganta srinivasa rao  AP Government  Teacher posts  DSC  TET  chandrababu  andhra pradesh  

Other Articles