First male contraceptive pill underway ఇక మగవారి వంతు.. గర్భనిరోధక మాత్రలోచ్చాయోచ్..

Scientist develop a male contraceptive pill that is safe

Health, contraceptives, male contraceptive pills, Male birth control pill, preventing pregnancy, male contraception

The latest effort to come up with a male birth control pill has found a formulation that appears to be safe. But the experimental pill has at least one of the same problems that plague female birth control pills.

ఇక మగవారి వంతు.. గర్భనిరోధక మాత్రలోచ్చాయోచ్..

Posted: 03/20/2018 06:12 PM IST
Scientist develop a male contraceptive pill that is safe

ఇన్నాళ్లు బిడ్డకీ బిడ్డకీ మధ్య మూడేళ్ల వత్యాసం వుండాలని ప్రభుత్వం చేసిన ప్రకటను అచరణలో చూపించేందుకు అడవాళ్లకు శాపంగా మారింది. కొందరు లూప్ లు, మరికోందరు కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇలా తమకు అందుబాటులో వున్న మార్గాల ద్వారా గర్భం రాకుండా చేసుకోవడం అడవాళ్లకు అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇక అడవాళ్లకు మాత్రమే కాకుండా ఇప్పుడిక మగవాళ్ల వంతు వచ్చేసింది.

పురుషుల్లో ప్రభావవంతంగా పనిచేసే గర్భ నిరోధక మాత్రను శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. దాని వాడకం సురక్షితమని తేలినట్లు వెల్లడించారు. వాస్తవానికి పురుషులు వినియోగించేందుకు వీలుగా కొన్ని గర్భనిరోధక మాత్రలను శాస్త్రవేత్తలు గతంలోనే అభివృద్ధి చేశారు. అయితే, అవి కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని.. దీంతో మగవాళ్లు అనారోగ్యం భారిన పడుతున్నారని తేలడంలో వాటి పట్ల ఎవరూ అదరణ కనబర్చలేదు.

ఇక దీనికి తోడు రోజుకు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మాత్రలను వేసుకోవాల్సి వస్తుందని తేలడంతో వాటి వినియోగానికి ఎవరూ మొగ్గుచూపలేదు. ఇందుకు పరిష్కారమార్గంగా ‘డైమిథేన్‌డ్రోలైన్‌ అండెకనోఏట్‌(డీఎంఈయూ)’ అనే ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. డీఎంఏయూ మాత్రల వాడకం అత్యంత సురక్షితమని.. రోజుకు ఒక్క మాత్ర వేసుకుంటే సరిపోతుందని వారు నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles