high court gives small relief to komati reddy, sampath కోమటిరెడ్డి, సంపత్ లకు స్వల్పఊరట..

High court gives small relief to komati reddy sampath

komati reddy venkat reddy, sampath, congress, komati reddy swamy goud, sampath, mike thrown at swamy goud, mlc chairman swamy goud, assembly all camera footage, advocate general, high court, governor budget specch, farmers betrayed, Telangana assembly, politics

congress mlas who were disqualified by on the allegation of throwing mike at mlc chairman swamy goud got some relief in high court.

కోమటిరెడ్డి, సంపత్ లకు స్వల్పఊరట..

Posted: 03/19/2018 04:27 PM IST
High court gives small relief to komati reddy sampath

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆ ఇద్దరి సభ్యత్వాన్ని శాసనసభ ఏకగ్రీవ తీర్మాణంతో రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల నోటిషికేషన్ ను కూడా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సవాల్ చేసింది. కాంగ్రెస్ దాఖలు చేసిన ఫిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను ఆరు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ సందర్భంగా వీరిద్దరూ అసెంబ్లీలో చివరి బడ్జట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో మైక్ విసిరేశారు. అది కాస్తా మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలిందని, దీంతో వారిద్దరీ అనర్హులుగా ప్రకటించామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, అధారాలు, సిసిటీవీ ఫూటేజీలు కూడా వున్నాయని తెలిపారు. దీంతో విచారణను ఈ నెల 22కు వాయిదా వేసిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘంతో వారం రోజుల పాటు ఎన్నికల నోటిఫికేషన్ అపితే అభ్యంతరాలేంటని ప్రశ్నించింది.

దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణతో ఏకీభవించని న్యాయస్థానం కోమటిరెడ్డి, సంపత్ లకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరాదని ఈసీకి ధర్మాసనం సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి వీడియోలను షీల్డ్ కవర్‌లో పెట్టి ఈనెల 22న కోర్టుకు అందజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles