KTR said to take 2 percent commission from contractors మా మంత్రి కేటీఆరే.. కమీషన్ తీసుకోమ్మన్నడు..

Ktr said to take 2 percent commission from contractors

rajanna siricilla disrict, siricilla muncipal chair person, chair person sammala pavani, KTR, KCR corruption, minister KTR, 2 percent commision, contractors, Telangana, politics

rajanna siricilla muncipal commissioner sammala pavani revealed that their minister KTR had said to take 2 percent commisions from contractors.

ITEMVIDEOS: మంత్రి కేటీఆర్ గారే.. కమీషన్ తీసుకోమ్మన్నడు..

Posted: 03/19/2018 05:38 PM IST
Ktr said to take 2 percent commission from contractors

కొత్తగా అవిష్కరింపబడిన తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ఎక్కడా తావులేకుండా పాలన సాగుతుందని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ సహా రాష్ట్ర మంత్రులందరూ గొప్పలకు పోతున్న తరుణంలో చాపకింద నిరులా అధికార పార్టీకి చెందిన స్థానికసంస్థల పాలకులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడుతున్నారన్న విషయం ఇప్పుడు అ పార్టీకి చెందిన వ్యక్తల ద్వారానే బహిర్గతమవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలో అన్ని రంగాలను శరవేగంగా అభివృద్ది వైపు పరుగు తీయిస్తున్నామని పాలకులు చెబుతుంటే.. అందులో నిజమెంత వుందన్న విషయాన్ని పక్కన బెడితే.. ఏ మేరకు అవినీతి జరుగుతుందన్న విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇది సర్వసాధారణమే.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు, వ్యక్తులు స్థానిక కౌన్సిలర్లకు రెండు నుంచి మూడు శాతం కమీషన్ ఇవ్వాలని అది కూడా రాజ్యంగంలో రాసివుందన్నట్లుగా చెబుతున్నారు సిరిసిల్ల మునిసిపల్ చెర్ పర్సెన్ పావని.

ఏకంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాక్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం తమ మున్సిపాలిటీ పరిధిలోనే జరగడం లేదని, యావత్ తెలంగాణా వ్యాప్తంగా నడుస్తున్న తంతేనని చెప్పడం మరింత విస్మయానికి గురిచేసింది. కమీషన్ ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లు.. దాని గురించి కూడా రాజకీయాలు చేయడం.. ఏంటీ స్వయంగా మా మంత్రిగారే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ తీసుకోమ్మన్నారని ఏకంగా మంత్రి కేటీఆర్ పేరును కూడా వాడేసుకున్నారు. దీంతో అవినీతి అంతా అందరికీ తెలిసే జరుగుతుందా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్సన్నమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో జరిగే బడా బడా అభివృద్ది పథకాల విషయంలో మరెంతెంత కమీషన్ నడుస్తుందోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles