BE student ends life, family alleges ragging నెట్టింట్లో మేఘన వేధింపుల వీడియోలు హల్ చల్

Be student meghana suicide videos of verbal altercation goes viral online

ssn college ground, shabhari apartments, Rajkumar, Meghana, Latha, channadandra, video footage, verbal altercation, mental harassment, HOD, Bengaluru

Meghana’s parents are alleging that ill-treatment by her classmates and harassment by a professor

ITEMVIDEOS: నెట్టింట్లో మేఘన వేధింపుల వీడియోలు హల్ చల్

Posted: 02/09/2018 10:51 AM IST
Be student meghana suicide videos of verbal altercation goes viral online

బెంగళూరులో కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థిని మేఘన ఆత్మహత్య కేసుకు సంబంధించి వారి తల్లిదండ్రులు అరోపిస్తున్నట్లుగానే అమెను వేధింపులే బలితీసుకున్నాయా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకు సాక్షాలు కూడా సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడంతో.. తొలి విద్యార్ధినీ విద్యార్థులే అమె పాలిట యమపాశంగా మారారన్నది నిజమవుతుంది. ఇలాంటి వీడియోలు అనేకం వున్నాయని వాటన్నింటినీ కూడా పోలీసులు తమ విచారణలో భాగంగా పరిశీలించి తమ బిడ్డను అన్యాయంగా బలితీసుకున్నవారికి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చదువులో చక్కగా రాణించి, యశ్వంతపుర పరిధిలోని దయానంద సాగర కాలేజీలో ఉచిత సీటు తెచ్చుకుని, ఇంజనీరింగ్ చదువుతున్న మేఘన, క్లాస్ ప్రతినిధిగా పోటీల్లో నిలబడింది. అయితే అమె ఈ పోటీలలో ఓడిపోవడంతో అమెకు వ్యతిరేంకంగా పోటీలో పాల్గోని గెలిచిన విద్యార్ధులు.. నిత్యమూ ర్యాగింగ్ చేస్తూ, మానసిక క్షోభకు గురిచేశారు. ఈ విషయమై మేఘన సంబంధింత హెచ్ ఓ డి కి కూడా ఫిర్యాదు చేసింది. అయితే అమె పిర్యాదుపై అద్యాపకులు కూడా స్పందించకపోవడంతో.. అమె వ్యతిరేక వర్గం చర్యలు శృతిమించాయి. దీంతో మానసిక క్షోభకు గురైన మేఘన నిత్యం అవమానాలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ కేసులో ర్యాగింగ్ కు, కళాశాలకు సంబంధం లేదని యాజమాన్యం వాదిస్తుండగా, మేఘనను కాలేజీలో ఏడిపిస్తున్న వీడియోలు ఇప్పుడు విడుదలై కలకలం రేపుతున్నాయి. కాలేజీ క్యాంపస్ లో తోటి విద్యార్థినీ విద్యార్థులు ఆమెతో అవమానకరంగా మాట్లాడిన వీడీయోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఓ విద్యార్ధి ఏకంగా మేఘనపై చేయిచేసుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది, దీన్ని సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానిత విద్యార్థినులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి సెల్ ఫోన్లను పరిశీలించగా, మేఘనను ర్యాగింగ్ చేస్తూ, దాన్ని వీడియో తీసి పైశాచికానందాన్ని పొందినట్టు వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ssn college  Meghana  Latha  channadandra  video footage  verbal altercation  Bengaluru  

Other Articles