pawan kalyan calls for long time సుదీర్ఘపోరాటానికి సిద్దంకండీ

Pawan kalyan calls for long time war in karimnagar

Pawan Kalyan Political Yatra, pawan kalyan janasena, janasena idealogies, pawan explains janasena priniciples, pawan kalyan party activists meet, Pawan fan mets accident, pawan kalyan party co-ordinators meet, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, party activists, co-ordinators, nizamabad, adilabad, karimnagar, telangana, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan appeals to party co-ordinators to be prepared for long time goal at karimnagar in shubham gardens.

ITEMVIDEOS: సుదీర్ఘపోరాటానికి సిద్దంకండీ: సమన్వయకర్తలకు పవన్ పిలుపు

Posted: 01/23/2018 02:34 PM IST
Pawan kalyan calls for long time war in karimnagar

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వేరైనా అందరం భారతీయులమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందని అన్నారు. పాలకుల ప్రాంతీయ అసమానతల పాలన వల్ల ప్రాంతీయ విభేదాలు తెరపైకి వస్తున్నాయని, ఇది సమాజానికి మంచిది కాదని అన్నారు. అయితే పాలకులు చేసే తప్పిదాలకు ప్రజలకు ముడిపెట్టడం కూడా సమంజసం కాదని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

తమ జనసేన పార్టీ నిబద్ధత, బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తుందని పవన్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పార్టీ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్‌.. తనకు ఏ ఒక్కరితో గొడవలు లేవని చెప్పారు. తనను ద్వేషించే వారికి గురించి అలోచించే తీరికే తనకు లేదని ఎందుకంటే తనను ప్రేమించే వారి కోసం అలోచించడానికి సమయం సరిపోవడం లేదని అన్నారు. ఈ విషయంలో తాను గౌతమ బుద్దుడి సిద్దాంతాన్ని ఫాలో అవుతన్నట్లు స్ఫష్టం చేశారు.

తనకు ఆంధ్రా, తెలంగాణ వేరు వేరు కాదని అన్నారు. దేశం కోసమే తన తాపత్రయమన్నారు. మూడున్నరేళ్ల క్రితం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం పట్ల మాట్లాడేముందు నేతలు సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. పసిబిడ్డలాంటి తెలంగాణను చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందని అన్నారు. తన జనసేన పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తుదివరకు ప్రయత్నిస్తుందని చెప్పుకోచ్చారు. వాటిని పరిష్కారించేందుకు కూడా శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అయితే పదే పదే చెప్పినా ప్రభుత్వాలు వినకపోతే మాత్రం వారితో విభేదిస్తామని అదే తమ అఖరి అస్త్రమని చెప్పారు. అందుకోసం పోరాటానికి సిద్ధం కావాలని.. తన లక్ష్యం, గమ్యం సుదీర్ఘమైనవని.. ఆ సుదీర్ఘపోరాటానికి సమన్వయ కర్తలు సిద్దంకావాలని పిలుపునిచ్చారు.

తాను మడమ తిప్పే మనిషిని కాదని.. ఇచ్చిన మాటను తిరిగి వెనక్కి తీసుకునే స్వభావం తనకు లేదని, మాట ఇస్తే దానికి కట్టుబడి వుంటానని చెప్పారు. జనసేన పార్టీని ఏదేని పార్టీలో విలీనం చేస్తారా..? అని అడుగుతున్నారని.. అలా చేయాల్సి వస్తే తాను సమన్వయకర్తల ముందుకు ఎందుకు వస్తానని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీకి అనేక అకాంక్షలు వున్నాయని, తెలంగాణ యువత అకాంక్షే తమ పార్టీ అకాంక్షగా చెప్పుకోచ్చిన పవన్ తెలంగాణ అడపడచుల అకాంక్ష కూడా తమ పార్టీ అకాంక్షగా చెప్పారు. అంతేకాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో వున్న అకాంక్ష.. తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల అకాంక్షలే తమ పార్టీ అకాంక్ష మార్చుకున్నామని, అవే తమ పార్టీని ముందుకు నడిపిస్తాయని అన్నారు.

తాను కొన్ని సందర్భాలలో పరిస్థితులపై, సమస్యలపై రాజీపడినట్లు కనిపిస్తుందని అయితే అది రాజీ కాదని, సంయమనంతో ముందుకు సాగడమని చెప్పారు పవన్. సున్నితమైన సమస్యలపై స్పందించేప్పడు కొంత సంయమనం అవసరమన్నారు. తెలంగాణ అమరవీరు అశయాల సాధన కోసం, తెలంగాణ ఏ అశయాల కోసం పోరాటం సాగించిందో అదే అశయాల సాధన కోసం తాను ఒక సైనికుడిలా పోరాడుతానని చెప్పారు. తెలంగాణలోని సంస్కృతులు, బాషను గౌరవించే విధానం తమ పార్టీకి వుందని అన్నారు. అయితే ఇదే సమయంలో రాజకీయాలలోకి కొత్త రక్తం రావాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త రక్తం గాందేయులు విస్మరించని జాతీయవాదాన్ని, అవినీతి, అక్రమాలను సహించనిదై వుండాలన్నారు. అంతేకాదు వీరితోనే పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే నవసమాజం కూడా సాధ్యమవుతుందని అన్నారు.

అఖండ భారతదేశం పాకిస్థాన్, ఇండియాగా విడిపోయిన క్రమంలో పాకిస్తాన్.. ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుందని.. అదే సమయంలో ఇండియా హిందూ దేశంగా ముద్రవేసుకోకుండా.. భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వమని చాటిచెప్పేలా సెక్యూలార్ (లౌకిక) దేశంగా ప్రకటించుకుందని చెప్పారు. దేశంలో అందరికీ అహార భద్రత కావాలన్నదే తమ పార్టీ విధానమంటూ చెప్పుకోచ్చిన పవన్.. దేశంలో అర్థిక పక్షపాతం కూడా వుండకూడదని, అలాంటి నవసమాజ నిర్మాణమే తమ సిద్దాంతమని కూడా ప్రకటించారు. కాగా, పవన్ ప్రసంగిస్తున్నంత సేపు నిశబ్దంగా వున్న సమన్వయ కర్తలు.. ఆయన కొంత గ్యాప్ తీసుకోగానే సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  principles  party activists  jai telangana  co-ordinators  telangana  politics  

Other Articles