Shiv Sena to go it alone in 2019 elections దశాబ్దాల మైత్రికి బ్రేక్.. ఒంటరిపోరుకు సై అంటున్న శివసేన

Shiv sena decides to end ties with bjp says will fight for hindutva

Shiv Sena, BJP, Uddhav Thackeray, Sanjay Raut, Narendra Modi, Maharashtra, Lok Sabha, Bal Thackeray, alliance

Making good on its long-standing threats, the Shiv Sena has sounded the death knell on its alliance with the BJP, passing a resolution to go solo in the upcoming general elections and Maharashtra assembly polls as well.

దశాబ్దాల మైత్రికి బ్రేక్.. ఒంటరిపోరుకు సై అంటున్న శివసేన

Posted: 01/23/2018 03:18 PM IST
Shiv sena decides to end ties with bjp says will fight for hindutva

శివసేస పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ ప్రభుత్వంతో తాము కలసి నడవలేమని ఇదే విధానాన్ని తాము రానున్న ఎన్నికలలోనూ అమలు చేస్తామని తేల్చిచెప్పింది. అధికారంలో వున్నా.. లేక విపక్షంలో వున్నా బీజేపితో సుదీర్ఘకాలంగా వున్న స్నేహాహస్తాన్ని వీడేందుకు తాము సిద్దమని ప్రకటిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది.. అటు ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు ఇటు మహారాష్ట్రలోనూ అధికార కాషాయపార్టీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన పార్టీ ఈ మేరకు ఇవాళ వెల్లడించింది.

2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా.. పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు పార్టీల మధ్య వున్న మైత్రికి ఇక ముగింపుదశకు చేరుకుంది.

1990ల నుంచే బీజేపి-శివసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి ఒంటిరిపోరుకు సిద్దపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు లభించకపోవడంతో మళ్లీ శివసేనకు స్నేహహస్తం అందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు బృహన్ ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయగా.. మేయర్ స్థానానికి బలం లేకపోవడంతో బీజేపి మద్దతుతో శివసేన కూడా మేయర్ పదవిని చేపట్టింది. అయితే ఐదేళ్ల క్రితం దేశప్రజల్లో వున్న మోడీ మానియా మసకబారిందని.. ఈ క్రమంలో బీజేపితో ముందుకు సాగలేమని శివసేన తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  BJP  Uddhav Thackeray  Sanjay Raut  Narendra Modi  Maharashtra  Lok Sabha  Bal Thackeray  alliance  

Other Articles