Ruling MLA encircled by farmers రైతుల రౌద్రం.. ఎమ్మెల్యే పరుగు..

Telangana peddapalli mla encircled by farmers

Peddapalli MLA encircled, MLA Dasari Manohar Reddy grilled, TRS MLA gherao, farmers encircled ruling MLA, irrigation water release issue, SRSP canal water, MLA engrilled at Gangaram village, Kalwa Srirampur mandal, viral news, latest updates

Peddapalli MLA Dasari Manohar Reddy of TRS was grilled by farmers from his Assembly constituency over delay in the release of irrigation water from the SRSP canal

పరుగులు పెట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యే.. రైతుల నిలదీత..

Posted: 01/23/2018 10:45 AM IST
Telangana peddapalli mla encircled by farmers

ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ.. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించేందుకు ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకున్న ప్రజానికం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. విద్యార్థులతో ప్రారంభమైన ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లడంతో రైతులు, రైతు కూలీలు, తెలంగాణ ఇంటి అడపడచులు అందరూ ఉద్యమంలో పాల్గోనడంతోనే రాష్ట్ర అవిర్భావం అనివార్యమైంది. రాష్ట్రంతో తమకు చేసేది ఏంటన్న భావనతో ఆరు దశాబ్దాల పాటు ఉద్యమం అంతర్లీనంగా వుండిపోయింది. అయితే అదే తమకు నేరుగా సమస్య ఉత్పన్నమైతే.. ఎరువుల కోసం పోలీసుల లాఠీల దెబ్బలు తీన్న రైతాంగం ఊరకుంటుందా.?

అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పలు గ్రామాల ప్రజలు ఎదుర్కోంటున్న సమస్య అది. దీంతో సంఘటితమైన రైతులు తమ మండలానికి వచ్చిన ఎమ్మెల్యేను మార్గమద్యంలో రైతులు ఎధురేగి నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారి ప్రశ్నలకు బదులీయలేక అక్కడి నుంచి నడస్తూ పక్కకు వెళ్లినా.. వదలకుండా వెంబడించిన రైతులను తప్పించుకునేందుకు ఎమ్మెల్యే పరుగు తీయాల్సి వచ్చింది. ఇంతలో పోలీసులు సకాలంలో స్పందించి.. ఎమ్మెల్యేను తమ వాహనంతో తీసుకెళ్లడంతో మొత్తానికి రైతుల చెర నుంచి తప్పించుకున్నారు.

అసలేం జరిగిందంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయన వస్తున్నారన్న సమాచారం అందుకున్న రైతులు మార్గమధ్యంలోనే ఆయన వాహనాన్ని అడ్డుకుని సాగు నీటి విషయమై నిలదీశారు. వారి ప్రశ్నలకు నోరళ్లబెట్టిన ఎమ్మెల్యే ఏం చెప్పాలో తెలియలేకపోయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పినా రైతులు వినే పరిస్థితిలో లేరు. అయితే కార్యక్రమ నిర్వాహకుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని సభకు హాజరయ్యారు ఎమ్మెల్యే.

దీంతో సభా కార్యక్రమ పూర్తైయ్యేంత వరకు అక్కడే వున్న రైతులు కార్యక్రమం ముగియగానే నేరుగా ఎమ్మెల్యే వాహనం వద్దకు చేరకుని ఘెరావ్ చేశారు. సభ అనంతరం వెళ్లిపోయేందుకు యత్నించిన అయనకు చేదు అనుభవం ఎదురైంది. రైతులు సంధిస్తున్నప్రశ్నలకు బదులు చెప్పలేకపోయారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఆయన వాహనాన్ని వదిలి కారు దిగి రాజీవ్‌ రహదారిపైకి నడుచుకుంటూ వెళ్లారు. అయినప్పటికీ రైతులు మరింత ఆగ్రహంతో ముందుకు రావడంతో మనోహర్ రెడ్డి పరుగు తీయాల్సి వచ్చింది. ఇంతలో పోలీసులు వచ్చి ఆయనను తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles