Drunk n drive penalty. If only walk no penalty పోలీసుల ఎత్తు.. మందుబాబుల పైఎత్తు..

Drunk n drive penalty if only walk no penalty

Drunkards, new idea, drunk and drive cases, drunk and walk, police checks, how to book cases on drunken drivers, drunken walkers, video uploaded on social media, big boss 11 contestant aarshi khan, social media, viral video, video viral

Drunkards new plan to avoid drunk and drive cases, they are getting down at the police check points and walking. police are in dilema on how to book cases on drunken drivers. The video uploaded by big boss 11 contestand aarshi khan on social media has gone viral.

ITEMVIDEOS: మందుబాబుల కొత్త ఎత్తుగడ.. డ్రంక్ అండ్ వాక్..

Posted: 01/23/2018 09:58 AM IST
Drunk n drive penalty if only walk no penalty

తలకు హెల్మట్ ఎవరి కోసం పెట్టుకోవాలని నిబంధనను తీసుకువచ్చారు పోలీసులు అంటే.. మన సంరక్షణ కోసమేనని సమాధానమిస్తాం. అలాగే మద్యం తాగి వాహనాలను నడపరాదన్న నిబంధనలను పోలీసులు ఎందుకు తీసుకువచ్చారంటే.. ప్రమాదాలు చెప్పిరావు. మద్యం తాగినప్పుడు నియంత్రణ కోల్పోయిన పక్షంలో ప్రమాదం ఎదురైతే అది ఆ వ్యక్తి, వ్యక్తులు కుటంబాల భవిష్యత్తునే చిదిమేస్తుందన్నది సత్యం. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ లు వద్దని పోలీసులు హెచ్చిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి మరీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

దీంతో పెద్ద కేసుల నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోవచ్చు కానీ, డ్రండ్ అండ్ డ్రైవ్ కేసుల్లోంచి మాత్రం తప్పించుకోవడం కష్టమని అన్నివర్గాలకు చెందిన ప్రజలు భావిస్తున్నారు. వారే కాదు రాజకీయ నేతల నుంచి అందరిదీ ఇదే మాట. ఈ నేపథ్యంలో యువత మరింత విభిన్నంగా అలోచించింది. పోలీసులకు చెక్ పాయింట్ల వద్ద వారికి చెక్ పెట్టేందుకు మరో కొత్త ఎత్తుగడను పన్నింది.  పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లో తప్పించుకునేందుకు ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. మందుబాబులు అమలు చేసిన ఈ ప్లాన్ తో వారిని ఎలా బుక్ చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.

అసలింతకీ ఏం జరిగిందంటే... దగ్గర్లో బార్ ఉందో ఏమో... చుక్కేసి బైకులెక్కిన వారికి, మూల మలుపులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ కనిపించారు. ఇంకేముందు, ప్రతి ఒక్కరూ చక్కగా బండి దిగేసి, వాటిని నెట్టుకుంటూ పోలీసుల ముందు నుంచి వెళ్లిపోయారు. వాళ్లు మందేశారని తెలిసినా, బండిని నడుపుకుంటూ వెళుతున్నారు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. అలా ఒకరు, ఇద్దరూ కాదు... వందల మంది ఇలా బండి నడిపించుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదుగానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని బుక్ చేయాలంటే మద్యం తాగి, బండిని నడిపించుకుని కూడా వెళ్లకూడదన్న చట్టం తేవాలేమో? ఆ వీడియోను మీరు వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles