Facebook Non Cooperation with Telangana Cyber Police | కేసీఆర్ పై పోస్టులు.. పోలీసులకు ఫేస్ బుక్ తిప్పలు

Facebook versus telangana government

Telnagana, Cyber Crime Police, CM KCR, Derogatory, Facebook, IP Address, Facebook CM KCR, Facebook Telangana Cyber Crime Police

Facebook Not Cooperate with Telangana Government to share IP Adress Details Who posts Derogatory against Chief Minister KCR.

కేసీఆర్ పై అనుచిత పోస్టులు.. ఫేస్ బుక్ తిప్పలు

Posted: 01/10/2018 04:51 PM IST
Facebook versus telangana government

తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ సంస్థకు మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘ఫేస్ బుక్’ లో గతంలో కొందరు ఆగంతకులు పోస్ట్ లు చేశారు.. అయితే అవి ఏ ఐపీ అడ్రసుల నుంచి వచ్చాయోతెలుసుకునేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

దీంతో సాయపడాల్సిందిగా కోరుతూ ‘ఫేస్ బుక్’ నిర్వాహకులను సీసీఎస్ పోలీసులు కలిశారు. అయితే, ఆ ఐపీ అడ్రసు వివరాలు చెప్పమని ‘ఫేస్ బుక్’ తేల్చి చెప్పింది. సాధారణ కేసులు లాంటిది కాదని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు అని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ సంఘటనపై మండిపడుతున్న పోలీసులు ఈ విషయమై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐడీ ద్వారా ఎంహెచ్ ఏకు ఓ లేఖ రాశారు.

కాగా, కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై చాదర్ ఘాట్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అయితే, తర్వాత ఈ కేసు సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ అయింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుపై విచారణ జరగుతోంది. ‘ఫేస్ బుక్’ నిర్వాహకులు సంబంధిత వ్యక్తుల ఐపీ అడ్రసులు ఇవ్వకపోవడంతో ఆ పోస్ట్ లు ఎవరు చేశారా అనే విషయం ఇప్పటివరకూ ఎటూ తేల్చలేకపోతున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు జాప్యం అవుతుండటంతో సీఎం కార్యాలయం సీసీపీఎస్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles