MPs and MLAs be barred from practising law? 22న తేలనున్న రాజకీయ, న్యాయవాదులకు భవితవ్యం

Top lawyer netas to be barred from practicing law by bar council of india

Bar Council of India, BCI, lawyers-turned-politicians, Congress, BJP, Chidambaram, Kapil Sibal, arun jaitley, ravi shanker prasad

Senior lawyers-turned-politicians have been asked to respond to a Bar Council of India notice asking whether or not they should be barred from practicing while serving as legislators.

22న తేలనున్న రాజకీయ, న్యాయవాదులకు భవితవ్యం

Posted: 01/10/2018 05:57 PM IST
Top lawyer netas to be barred from practicing law by bar council of india

ప్రజాప్రతినిదులుగా కోనసాగుతూ ఇటు న్యాయవాద వృత్తిలోనూ రాణిస్తున్న అడ్వకేట్లకు షాక్ తగలనుంది. ఈ నెల 22న వారి భవితవ్యం తేలనుంది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా లేదా కార్పొరేటర్లుగా ఉంటూ లాయర్‌ వృత్తిని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని న్యాయవాద వృత్తి చేపట్టకుండా బార్‌ కౌన్సిల్‌ ఎందుకు డీబార్‌ చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోగా సమాధానాలను కౌన్సిల్‌కు గడువు ఇచ్చింది.

ఈ విషయంపై నియమితమైన ముగ్గురు నిపుణుల కమిటీ.. దేశవ్యాప్తంగా 500 మందిపైగా ‘పొలిటీషియన్‌’ లాయర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఒకవేళ రాజకీయ నాయకులకు లాయర్లుగా కొనసాగే అర్హత లేదనే నిర్ణయం వెలువడితే, వారందరూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలకు దిగకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్‌, లాయర్‌ అశ్విని ఉపాధ్యాయ పొలిటీషియన్‌ లాయర్లను డిబార్‌ చేయాలంటూ గతంలో భారతీయ ప్రధాన న్యాయమూర్తి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌లకు లేఖ రాశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో ఉదహరించిన అశ్విని.. ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటున్న ఓ వ్యక్తి లేదా సంస్థ లేదా కార్పొరేషన్‌ ఓ కోర్టులో న్యాయవాదిగా వాదించలేదని పేర్కొన్నారు. కాగా, రాజకీయ నాయకులు న్యాయవాద వృత్తి ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై బార్‌ కౌన్సిల్‌ ఈ నెల 22న తుది విచారణ జరపనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : politicians  lawyers  Bar Council of India  notices  

Other Articles