Your Aadhaar number can give away your bank name ఆధార్ నెంబరు తెలిస్తే చాలు.. బ్యాంకు పేర్లు అందుబాటులోకి

Your aadhaar number can see which bank you have an account

aadhaar number, bank account linking, uidai, sms flaw aadhaar, uidai, aadhaar, bank account, linking

UIDAI, the authority that issues Aadhaar, allows people to check online if their bank account has been linked to Aadhaar with its Bank Mapper website.

ఆధార్ నెంబరు తెలిస్తే చాలు.. బ్యాంకు వివరాలు అందుబాటులోకి

Posted: 01/10/2018 02:02 PM IST
Your aadhaar number can see which bank you have an account

మీ అధార్ నెంబరు ఎవరికైనా తెలుసా.. అయితే తస్మాత్ జాగ్రత్త సుమా.. ఎందుకంటారా.. అధార్ నెంబరు ఒక్కటి తెలిస్తే చాలు.. ఇక మీ బ్యాంకు అకౌంట్లు ఏయే బ్యాంకుల్లో వున్నాయన్న విషయం కూడా ఇట్టే తెలిసిపోతుంది. అది కూడా మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అవసరం లేకుండా.. లేదా ఒటిపి ( వన్ టైం పాస్ వర్డ్) లేకుండానే ఇకపై ఎవరి వివరాలనైనా తెలుసుకునే అవకాశం వుంది. అయితే వారి అధార్ నెంబరు తెలిస్తే సరిపోతుంది.

యూఐడిఏఐ ఉడాయ్ లో ఈ లోపాన్ని గుర్తించిన టెక్కీలు.. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు చేర్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అయితే అకౌంట్ ఏయే బ్యాంకుల్లో వుందో తెలుసిపోతున్న క్రమంలో  హ్యాకర్లు తమ అకౌంట్లను కూడా హ్యాక్ చేసి డబ్బులను డ్రా చేసుకునే అవకాశాలు కూడా వున్నాయన్న అందోళనలో ఖాతాదారులు బెంబెలెత్తిపోతున్నారు.

అయితే వాస్తవానికి అధార్ కార్డుదారులు తాము ఏయే బ్యాంకులకు అధార్ నెంబరును అనుసంధానించామన్న విషయాలను తెలుసుకునేందుకు అధార్ బ్యాంక్ మేఫర్ వైబ్ సైట్ ద్వారా అవకాశాన్ని కల్పించింది. కాగా, ఈ వివరాలను తెలుసుకునేందుకు ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ ను వినియోగించాల్సి వుంటుంది. రిజిస్టర్ మొబైల్ వినియోగించినప్పటికీ.. భద్రతపై అనుమానాలు వున్న క్రమంలో ఒటిపీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొనింది. కాగా ఇప్పుడు అవేమీ లేకుండానే వివరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అదెలా.. అంటున్నారా..? లేక మీరు ఓ సారి ప్రయత్నించి నిజానిజాలను తెలుసుకోవాలని భావిస్తున్నారా..? అయితే మీ ఫోన్ నుంచి *99*99*1# అని టైప్ చేయండీ. ఆపై తెరపై కనిపించే డైలాగ్ బాక్సులో మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. ఇక నెంబర్ సరిచూసుకుని కన్ఫర్మ్ చేయండి. అంతే తెరపై చూస్తే ఏఏ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానమై ఉన్నాయో మీ ఫోన్ తెరపై అవిష్కృతమౌతుంది. దీంతోనే ఖాతాదారులు అందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhaar number  bank account linking  uidai  sms flaw aadhaar  uidai  aadhaar  bank account  

Other Articles

 • Cbi files case against former icici bank chief chanda kochhar

  చందా కొచ్చార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. సీబిఐ కేసు..

  Jan 24 | క్విడ్ ప్రోకో కింద అధికార దుర్వినియోగానికి పాల్పడి వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసి ఫలితంగా తన భర్తకు చెందిన పరిశ్రమలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించారన్న అభియోగాలపై ఐసీఐసీఐ... Read more

 • Case filed against actress bhanupriya in child labour and abuse

  పనిపిల్లపై వేధింపులు.. సినీనటి భానుప్రియపై కేసు..

  Jan 24 | నిన్నటి తరం సినీహీరోయిన్ భానుప్రియ సహా అమె సోదరుడిపై పోలీసు కేసు నమోదూంది. బాలకార్మిక చట్టానికి తూట్లు పోడిచిన కారణంతో పాటు మైనర్ బాలికలతో దురుసుగా ప్రపర్తించారన్న నేరాభియోగాలపై అంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి... Read more

 • Evm row not going back to ballot papers says cec sunil arora

  ఈవీఎంలకే ఓటు.. పాత రోజులకు వెళ్లలేమన్న సీఈసీ..

  Jan 24 | ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్‌ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన బీజేపి పార్టీ ఈవీఎం ట్యాపరింగ్ ద్వారానే అధికారంలోకి వచ్చిందని అమెరికాలో ఆశ్రయం పోందుతున్న సైబర్‌ నిపుణుడు, ఈవీఎం... Read more

 • Unaccounted cash of rs 6 crore seized in nellore

  కారులో రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు.. పోలీసుల ఛేజ్

  Jan 24 | ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఓ కారు వేగంగా వెళ్లడాన్ని గమనించిన పోలీసులు దాని ఛేజ్ చేశారు. అయితే పోలీసుల వెంటవస్తున్నారని గమనించిన కారులోకి వ్యక్తలు మరింతగా వేగాన్ని పెంచారు. కట్ చేస్తే కారును ఛేజ్ చేసిన... Read more

 • Boeing s self flying car has taken its first flight

  ITEMVIDEOS: ఫ్లయింగ్ కారును విజయవంతంగా పరీక్షించిన బోయింగ్

  Jan 24 | సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటూ.. ప్రస్తుతం పట్టణ రవాణా రంగంతో పాటు బట్వాడా రంగంలోనూ భవిష్యత్తులో అత్యంత కీలకం కానున్న సరికొత్త వాహనాన్ని రూపొందించిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ దానిని... Read more

Today on Telugu Wishesh