Ex-SBI Chief & Others Stranded at Azerbaijan Airport for 19 Hours అరుంధతి సహా అందరికీ చుక్కలే..

Ex sbi chief others stranded at azerbaijan airport for 19 hours

Arundhati Bhattacharya, SBI chief, British Airways, Arundhati Bhattacharya British Airways, British Airways emergency landing, Azerbaijan Airport

The emergency landing of a Mumbai-London British Airways flight in Baku, the capital of Azerbaijan, led to ordeal for all passengers. And among the passengers was former State Bank of India chief Arundhati Bhattacharya.

అరుంధతి సహా అందరికీ చుక్కలే..

Posted: 12/14/2017 08:42 AM IST
Ex sbi chief others stranded at azerbaijan airport for 19 hours

భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు దేశంకాని దేశంలో పరాభవం ఎదురైంది. అమెకు మాత్రమే కాదు అమెతో పాటు డజన్ల కొద్ది భారతీయులకు ఈ అనువాన్ని చవిచూడాల్సి వచ్చింది. కేవలం భారతీయులకే కాదు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ ఆ విమానయాన సంస్థ చుక్కలు చూపిచింది. ముంబై నుంచి లండన్ కు వెళ్లాల్సిన బీఏ 198 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరాల్సి ఉండగా లండన్ లో భారీ మంచు కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

విమానం టేకాఫ్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ గ్యాలరీలో యాసిడ్ వాసన రావడాన్ని గమనించారు. కొద్ది సేపటికి పొగలు కూడా వస్తున్నట్టు సిబ్బంది గుర్తించడంతో పైలట్ కు సమాచారం చేరవేశారు. దీంతో విమానాన్ని ఎవర్జెన్సీ ల్యాండింగ్ కోసం అన్ని విమానాశ్రయాలకు సమచారం చేరవేయడంతో.. వెంటనే స్పందించిన అజర్ బైజాన్ లోని బకు విమానాశ్రయం నుంచి అత్యవసరంగా ల్యాండింగ్ అనుమాతి లభించడంతో అక్కడ ల్యాండ్ చేశారు. అక్కడ సమస్యను గుర్తించిన ఇంజనీర్లు దానికి మరమ్మతులు చేశారు.

అయితే అప్పటికే తాము 12 గంటల డ్యూటీ చేయడంతో ఇక తమ వల్ల కాదని విమానాన్ని ప్రయాణికులను వదిలిపెట్టి సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో మరో సిబ్బంది వచ్చి ప్రయాణికులను అదే విమానంలో గమ్యస్థానాలకు చేర్చాల్సి వచ్చింది. ఇందుకు గాను ఏకంగా 19 గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అయితే విమానయాన సంస్థ మాత్రం తాము ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించామని చెప్పడం గమనార్హం. ఈ సమయంలోనే విమానాశ్రయంలోని లాంజీలోనే నిద్రపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles