No deadline to link aadhar card with bank account బ్యాంకు అకౌంట్ తో ఆధార్ లింక్.. డెడ్ లైన్ గడుపు లేదు..

No deadline to link aadhar card with bank account

Central Government, Deadline, Aadhar Card, Interim Relief, Constitution, Bank Account, Application

People who have not linked their Aadhaar card to their bank account can relax as the central government has withdrawn its decision. Henceforth, there will be no deadline for linking.

డెడ్ లైన్ గడుపు లేదు.. బ్యాంకు అకౌంట్ తో ఆధార్ లింక్..

Posted: 12/13/2017 09:03 PM IST
No deadline to link aadhar card with bank account

బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే తేదీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఇప్పటి వరకు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ తేదీని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా పేర్కొంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్‌, ఆధార్ అనుసంధానం చేసుకోని ఖాతాదారులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.

 వివిధ సేవలు, పలు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఇచ్చిన గడువును పొడిగించేందుకు సుముఖంగా ఉన్నామని గతంలోనే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. వాటి విచారణను రేపు సుప్రీంకోర్టు చేపట్టనుంది. దానికి ముందే ఆధార్ అనుసంధాన గడువును పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా.. మొబైల్ నంబర్‌కు ఆధార్ గడువు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6తో ముగుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Central Government  Deadline  Aadhar Card  Interim Relief  Constitution  Bank Account  Application  

Other Articles