Pawan Kalyan begins his political tour జనసేనాని తెలుగురాష్ట్రాల పర్యటన షురూ..!

Pawan kalyan to visit vishaka condolence to venkatesh family

Jana Sena, Pawan Kalyan, telugu states tour, political tour, venkatesh, chalore chalore chal, condolence, krishna ferru turndown victims, telangana, msc physics student, murali, Andhra Pradesh, Hyderabad, telugu cinema, Tollywood

Pawan Kalyan has again taken to Twitter in a huge manner this time on which he shared a video ‘Chalo Re Chal’ urging people to question and revolt against the failed promises of the government.

ITEMVIDEOS: జనసేనాని తెలుగురాష్ట్రాల పర్యటన షురూ..!

Posted: 12/06/2017 09:47 AM IST
Pawan kalyan to visit vishaka condolence to venkatesh family

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాననని ప్రకటించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తన పార్టీ కోసం పనిచేసే జనసైన్యాన్ని సిద్దం చేసుకున్నారు. గత మూడేళ్లుగా అడపా దడపా జనంలోకి వచ్చిన పవన్.. ఇకపై పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. ఎన్నికలకు అన్ని పార్టీలు అప్పుడే సమాయత్తం అవుతున్న నేపథ్యంలో తన పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన కోసం ‘ చలోరే చలోరే చల్’ పేరుతో యాత్ర ప్రారంభించనున్నారు.

ఈ యాత్రను విశాఖపట్నం నుంచే ప్రారంభించిన తెలంగాణ సిద్దపేటలోని మురళీ కుటుంబాన్ని పరామర్శించడంతో ముగియనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు బుధవారం ఉదయం పవన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆత్మహత్య చేసుకున్న ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్ కుటుంబాన్ని పవన్ మరికాసేట్లో పరామర్శిస్తారు. అనంతరం గురువారం పోలవరం పనులను పరిశీలించడానికి వెళ్తారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ జనసేన కార్యాయంలో సామాజిక మాద్యమం ద్వారా వెలువరించిన ఓ ప్రకటనలో పేర్కొనింది. తొలి విడతలో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన పెంచుకుంటానని, ఆయనా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేకుంటే రెండో విడతలో గుర్తు చేస్తానని చెప్పారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే మూడో విడత పర్యటనను పోరాట వేదికగా మారుస్తానని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అసహనం వ్యక్తం చేసిన పవన్.. ‘ఒక దేశానికి సంపద ఖనిజాలు, నదులు, అడవులు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత’ అని అన్నారు. మహాకవి శేషేంద్ర శర్మ చెప్పినట్టుగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యువత నిరాశ, నిస్పృహలతో ఉన్నారన్నారని.. ఇది దేశానికి క్షేమం కాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles