hero vishal arrested after nomination rejected హీరో విశాల్ నమినేషన్ తిరస్కరణ, అరెస్ట్..

Hero vishal arrested after nomination rejected

vishal arrested, vishal nomination rejected, rk nagar election officer, rk nagar returning officer, Kollywood, Vishal, nomination, reject, returning officer, arrest, Nadigar Sangam, Rk nagar by election, By polls, Vishal files nomination, Jayalalithaa, AIADMK, Tamil nadu politics

kollywood hero vishal nomination rejected by election returning officer, who states mistakes are responsible for it which led the hero spontanously to stage a protest on road to this EC decision. police entered into the scene and arrested the hero

హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ, అరెస్ట్..

Posted: 12/05/2017 07:10 PM IST
Hero vishal arrested after nomination rejected

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తసీుకున్న తమిళనాడు అధికార పక్షం ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకుని తామే అమ్మకు అసలు వారసులం అన్న సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ అర్కే నగర్ నామినేషన్ల ధరఖాస్తులన్నింటినీ స్ర్కూటినీ చేసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బరిలో నిలిచిన అభ్యర్థులకు వరుస షాకులు ఇస్తున్నారు. తొలుత జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కు ఊహించని షాక్ ఇచ్చిన ఈసీ.. పనిలో పనిగా చివరిక్షణంలో బరిలోకి దిగిన నటుడు విశాల్ నామినేషన్ ను కూడా తిరస్కరించారు.

ఈ మేరకు అధికారికంగా కొంతసేపటి క్రితం ప్రకటన చేసిన ఈసీ.. నటుడు విశాల్ తో పాటు దీపా జయకుమార్ కూడా వారు దాఖలు చేసిన నామినేషన్లలో తప్పులు దొర్లినట్లు ఈసీ ప్రకటనలో పేర్కొనింది. నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆధికారి పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు.

విశాల్‌ అరెస్ట్‌...

అయితే తాను దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై హీరో విశాల్ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల రిట్నరింగ్ అధికారి తన నామినేషన్ ను తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట​ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles