no surprise checks, chips loot vehicle owners వైరల్ న్యూన్: తస్మాత్ జాగ్రత్తా.. లేదంటే జేబు గుల్ల..

Viral news this is how petrol pumps cheat vehicle owners in hyderabad

Yousufguda petrol pump, 1st batallion petrol pump, vehicle owners cheated by petrol pumps, unicorn bike, chips in petrol meters, social media, facebook, viral news, new viral

A viral news is doing rounds in social media as a guy who filled his bike tank capacity of 13 ltrs, at 1st batallion in yousufguda in hyderabad sereved with bill of Rs 12oo plus with tank not fully filled.

వైరల్ న్యూన్: తస్మాత్ జాగ్రత్తా.. లేదంటే జేబు గుల్ల..

Posted: 11/11/2017 03:09 PM IST
Viral news this is how petrol pumps cheat vehicle owners in hyderabad

ఎన్ని చర్యలు తీసుకున్నా పెట్రలో బంకు యాజమానులు వాహనదారులను చూ మంతర్ కాళీ.. అన్నట్లుగా దెబ్బకు మోసం చేస్తారు. మనం మీటరేనే చూస్తుంటాం.. కానీ అందులో వున్న చిప్ లు మనం చూస్తున్నది నిజం కాదని, మనకు పోస్తున్న పెట్రోల్ కూడా మీటర్ చూపించిన మోతాదులో వుండదని తెలిసినా.. అక్కడ చూపించే డబ్బులు మాత్రం చెల్లించక తప్పదు. అదరమారవాల్సిన అవసరం లేదు.. చూడలేమని చెప్పలేము కళ్లముందే చూస్తుండగానే మనం కళ్లను నమ్మలేని విధంగా జేబులు గుల్ల చేస్తున్నారు పెట్రోల్ బంకు యజమానులు అదెలా అంటే వివరాల్లోకి వెళ్తామా..

నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున డేవిడ్ కుమార్ అనే వ్యక్తి.. యూసుఫ్ గూడలోని ఓ పెట్రోల్ బంకులో తన టూ వీలర్ కు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ కొట్టించాడు. బంకు సిబ్బంది పెట్రోల్ పోస్తూనే ఉన్నారు. ఎంత అంటే 16.95 లీటర్లు కొట్టారు. ఆ బండి హోండా యూనికార్న్ 2013 మోడల్. ఇక్కడ వాస్తవం ఏంటంటే.. ఆ బండి ట్యాంక్ కెపాసిటీ కేవలం 13 లీటర్లు మాత్రమే. చిత్రంగా 16.95లీటర్ల వరకు మీటర్ చూపించింది. అప్పటికీ ట్యాంక్ ఫుల్ కాలేదు. దీంతో షాక్ అయిన డేవిడ్.. వాటికి సంబంధించిన బిల్లు, మీటర్ రీడింగ్ కూడా ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

లీటర్ కు కేవలం 800 పాయింట్లు మాత్రమే వస్తుందని.. 200ml కాజేస్తున్నారని లెక్కలు వేశాడు. తన దగ్గర దోపిడీ చేసిన 250 రూపాయలు వద్దని.. ఇలాంటి మోసాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. అందరూ పెట్రోల్ బంకుకి బాటిల్స్ తో వెళితే మంచిదని సూచించాడు. ఈ పోస్ట్ 8వేల షేర్లతో ప్రతి ఒక్కరికి చేరుతూ టాప్ డిస్కషన్ గా నిలిచింది.ఈ మోసాన్ని ఓ యువకుడు వెలుగులోకి తీసుకొచ్చి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే హైదరాబాద్ మొత్తం వైరల్ అయ్యింది. 3వేల 500 లైక్స్, 8,880 షేర్స్ తో ఫేస్ బుక్ టాప్ లో ట్రెండ్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1st batallion petrol pump  yousufguda  unicorn bike  hyderabad  social media  facebook  viral news  

Other Articles