house owner assault on tenant in kphb కిరాయిదారుడిపై ఇంటి యజమాని దౌర్జన్యం

House owner assault on tenant in kphb

tenant agreement, house owner, gopalam srihari, mohan reddy, sita prasad, kphb police station, mla, madhavaram krishna rao, crime

house owner vandalised his house threatening his tenants to vacate as early as posible, kphb police filed case and investigatiiong the case.

కిరాయిదారుడిపై ఇంటి యజమాని దౌర్జన్యం

Posted: 11/03/2017 11:57 AM IST
House owner assault on tenant in kphb

ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారిపై ఇంటి యజమాని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాను ఇంటిని అమ్మేశానని, ఇంట్లో వున్న అద్దెదారులతో చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ అనైతిక చర్యలకు పాల్పడ్డాడు. తన అనుచరగణంతో అద్దెంట్లోని వారిపై జులుం ప్రదర్శించాడు. కిరాయిదారుడితో పాటు అతని భార్య, కూమార్తెను గదిలో బంధించి ఇంట్లోని సామాన్లు, వస్తువులను బయట పడేశాడు. గోడలను కూల్చివేశారు. సంచలనం రేకితిస్తున్న ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొక్కంటి మోహన్‌రెడ్డి, సంధ్య దంపతులు కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్ ఎంఐజీ-6/1 ఇంటిని కిరాయి తీసుకున్నాడు. ఇంటి ఓవర్ ఎం.ఎల్.ఎం.సీతాప్రసాద్ తో ముందస్తుగా చేసుకన్న ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాల పాటు ఇక్కడే వుంటానని అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. దీంతో ఇంటి మరమ్మతులకు గాను దాదాపుగా నాలుగు లక్షల రూపాలయను కూడా ఖర్చుచేశాడు. నాలుగేళ్లు గడవగానే ఇంటి యజమాని కిరాయిదారుతో చేసుకున్న ఒప్పందాన్ని మర్చిపోయి ఇంటిని  గోపాలం శ్రీహరికి విక్రయించాడు.

దీంతో కొత్త యజమాని గోపాలం శ్రీహరి ఇల్లును ఖాళీ చేయాలని సంధ్య, మోహన్ రెడ్డి దంపతులను వేధించడం మొదలుపెట్టాడు. ఇంటి మొదటి ఓనర్ సీతాప్రసాద్ ల అంగీకారం మేరకు రూ.4లక్షలు ఇంటి మరమ్మతుల కోసం ఖర్చు పెట్టామని మా డబ్బులు రావాలని కొత్త ఓనర్ కు చెప్పడం జరిగింది. తన కొడకు అనారోగ్యంతో మరణినంచడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని, కొద్ది కాలం ఆగితే ఇల్లు ఖాళీ చేస్తామని కొత్త ఓనర్‌కు చెప్పినా వినకపోవడంతో కోర్టును ఆశ్రయించి స్టెటస్ స్కొను తీసుకున్నాడు.

ఈ క్రమంలో గోపాలం శ్రీహరితో పాటు యాభై మంది దుండగులు ఇంట్లో చొరబడి సామాన్లను బయటపడేసి. ఇంటి గొడలను కూడా కూల్చివేశారు. మోహన్ రెడ్డి భార్య మెడలోని బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను తీసుకుని పరారైనట్లు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles