missing-narayana-student sai prajwala safe..? రూ.2000తో అక్కడికి వెళ్లిన సాయిప్రజ్వల క్షేమమేనా..?

Missing narayana student sai prajwala safe

narayana college, coaching centre, narayana hostel, sai prajwala, student, bandlaguda, Hyderabad, Telangana, rachakonda police, telangana police, crime

Sai Prajwala, an 18-year-old student of medicine at Narayana Coaching Centre, Bandlaguda, who reportedly ran away from home leaving behind a letter is suspected to be in tirupati. police ran into scene after they were informed by the locals.

సాయి ప్రజ్వల అక్కడ క్షేమంగానే వుందా..?

Posted: 10/17/2017 11:21 AM IST
Missing narayana student sai prajwala safe

మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న నారాయణ కాలేజీని మూసివేయించాలని డిమాండ్ చేస్తూ ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సాయి ప్రజ్వల క్షేమంగానే వుందా..? అసలు అమె ఎక్కడికి వెళ్లింది. ఇంట్లోంచి రూ. 2000 తీసుకున్న ప్రజ్వల.. వాటితో ఏం చేద్దామని తీసుకెళ్లింది. అంటే అమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా తనపై చదవు కోసం ఒత్తిడి లేని ప్రాంతానికి వెళ్లాలని భావించిందా.? అంటే అమె క్షేమంగానే వుందా...? అంటే అవునన్న సంకేతాలు వినబడతున్నాయి.  

తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర సాయిప్రజ్వల ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. అమెను సాయి ప్రజ్వలగా అనుమానించిన స్థానికులు అమెను అక్కడే కూర్చోబెట్టి ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమె సాయి ప్రజ్వలేనా..? లేక అమెలా పోలివున్న మరో అమ్మాయా..? అన్న వివరాలను నిర్ధారించుకోనే పనిలో పడ్డారు. ఇవాళ మధ్యాహ్నంతో ఈ విషయం నిర్థారణయ్యే అవకాశం వుంది.

తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఒంటిరిగా తచ్చాడుతున్న అమ్మాయిని సాయిప్రజ్వల స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు అమ్మాయిని తమ వెంటబెట్టుకుని హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ పోలీసులతో పాటు అమ్మాయి తండ్రి కూడా తిరుపతికి బయలుదేరి వెళ్లారు. తండ్రి గుర్తించిన తర్వాతే నిర్థారిస్తామని, మధ్యాహ్నం లోపు గుర్తించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా సాయి ప్రజ్వల క్షేమంగా లభించాలని అమె కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narayana college  coaching centre  narayana hostel  sai prajwala  student  bandlaguda  Hyderabad  Telangana  crime  

Other Articles